News October 7, 2025
ఘనంగా పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు.. PHOTOS

AP: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు తన కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సిరిమానోత్సవం నిర్వహించనున్నారు.
Similar News
News October 7, 2025
కంచం కడిగిన నీటిని ఏ దిక్కున పారబోయాలి?

పళ్లెం కడిగిన నీటిని పారబోసే దిక్కులు మన వృద్ధిని ప్రభావితం చేస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ నీటిని తూర్పు, పశ్చిమం, ఉత్తరం, ఈశాన్యం దిక్కుల వైపు చల్లడం శుభప్రదం అని అంటున్నారు. ఉత్తరం, ఈశాన్యం వైపు చల్లితే లక్ష్మీ కటాక్షం, ధనవృద్ధి, సౌభాగ్యం కలుగుతాయని సూచిస్తున్నారు. ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, వాయవ్యం వంటి దిక్కుల్లో పారబోస్తే ఇంట్లో సంకటాలు, రోగభయాలు, శత్రుత్వం వంటివి కలుగుతాయని అంటున్నారు.
News October 7, 2025
MP సీటుతో కమల్ అమ్ముడుపోయారు: అన్నామలై

కరూర్ తొక్కిసలాటపై TNలో రాజకీయ చిచ్చు రాజుకుంది. ప్రభుత్వాన్ని పొగిడిన కమల్ హాసన్‌పై బీజేపీ నేత అన్నామలై విరుచుకుపడ్డారు. MP సీటుతో DMKకి అమ్ముడుపోయారని విమర్శించారు. ఆయన్ను తమిళ ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు. కాగా ఇటీవల బాధితుల్ని పరామర్శించిన NDA ఎంపీలు ప్రభుత్వ వైఫల్యమే కారణమని తప్పుబట్టారు. కరూర్ ఘటనను BJP రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని CM స్టాలిన్ దానికి కౌంటరిచ్చారు.
News October 7, 2025
నాణ్యతా తనిఖీల్లో ఇంత నిర్లక్ష్యమా?

దగ్గు మందుకు 15 మంది చిన్నారులు బలి కావడం దేశంలో నాణ్యతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. 2022లోనూ మన దేశం నుంచి ఎగుమతైన మందుల వల్ల గాంబియాలో డజనుకు పైగా పిల్లలు మరణించారు. అయినా వాటి నుంచి ఎందుకు పాఠాలు నేర్చుకోలేదని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఔషధ తయారీలో వ్యవస్థాపరమైన లోపాలు అందరికీ ముప్పేనని విమర్శిస్తున్నారు. కాగా ఈ ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలని సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది.