News August 12, 2024
గ్రాండ్‌గా పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు

పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు ఘనంగా ముగిశాయి. ఫ్రెంచ్ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా ముగింపు వేడుకలు జరిగాయి. భారత్ తరఫున షూటర్ మనూ భాకర్, హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రేజేశ్ ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. భారత త్రివర్ణ పతాకాన్ని వీరిద్దరూ చేబూని ముందు నడవగా మిగతా క్రీడాకారులు వీరిని అనుసరించారు.
Similar News
News November 26, 2025
HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.
News November 26, 2025
భట్టి కుమారుడి ఎంగేజ్మెంట్.. హాజరైన సీఎం

TG: హైదరాబాద్‌లో జరిగిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సతీమణి, కూతురు, అల్లుడితో కలిసి వచ్చిన సీఎం.. కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.
News November 26, 2025
RRR కేసు.. సునీల్ కుమార్‌కు సిట్ నోటీసులు

AP: రఘురామ కృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసులో IPS అధికారి, సీఐడీ మాజీ చీఫ్ PV సునీల్‌కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. DEC 4న జరిగే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. 2021లో రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. కస్టడీలో చంపేందుకు ప్రయత్నించారని RRR 2024లో గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సునీల్ కుమార్‌తో పాటు మాజీ సీఎం జగన్, మరికొందరిని నిందితులుగా చేర్చారు.


