News August 16, 2024
అమ్మమ్మ మాట్లాడటం లేదని..

TG: అమ్మమ్మ అంటే ఓ ఎమోషన్. చిన్నప్పటి నుంచి లాలించిన అమ్మమ్మ మాట్లాడటం మానేయడంతో ఆ మనవరాలు తట్టుకోలేకపోయింది. మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. హన్మకొండ(D) భీమదేవరపల్లికి చెందిన నిఖిత(22)కు అమ్మమ్మ వెంకటలక్ష్మి అంటే చాలా ఇష్టం. ఇటీవల యువతి కుటుంబంతో వెంకటలక్ష్మికి మనస్పర్ధలు రావడంతో ఆమె వారితో మాట్లాడటం మానేసింది. అప్పటినుంచి బాధలో ఉన్న నిఖిత బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Similar News
News December 4, 2025
HYD: కేటీఆర్ పర్యటనలో కెమెరామెన్ మృతి

కేటీఆర్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. విడియో తీస్తుండగా గుండె నొప్పితో ఆజ్ తక్ ఛానల్ కెమెరామెన్ దామోదర్ కుప్పకూలారు. గమనించిన పోలీసులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దామోదర్ మృతి చెందారు. మృతదేహం గాంధీ మార్చరికి తరలించారు.
News December 4, 2025
గుర్తింపు, పదవుల కోసం పాకులాడను: పవన్

AP: నిస్సహాయులకు అండగా నిలబడటమే నాయకుడి లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. చిత్తూరులో కూటమి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. తాను గుర్తింపు, పదవుల కోసం పాకులాడలేదని తెలిపారు. ప్రజలకు సేవ చేసే ప్రయాణంలో పదవి వస్తే అలంకారం కాదు బాధ్యత అని నమ్ముతానన్నారు. అదృష్టవశాత్తు తన పేషీలోని అధికారులు కూడా సమాజానికి మంచి చేద్దాం అనే తపన ఉన్నవాళ్లేనని పేర్కొన్నారు.
News December 4, 2025
మన రూపాయికి విలువే లేదు: ఖర్గే

డాలర్తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల <<18465153>>కనిష్ఠ స్థాయి<<>>కి చేరడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. కేంద్ర ప్రభుత్వం వల్లే రూపాయి క్షీణిస్తోందని ఆరోపించారు. ‘కేంద్రం విధానాలు మన కరెన్సీని బలహీనపరిచాయి. అవే బాగుంటే రూపాయి పైకి ఎగిసేది. మన ఆర్థిక పరిస్థితి బాగా లేదని తెలుస్తోంది. మనకు నచ్చింది చెప్పుకోవచ్చు, మనల్ని మనం మెచ్చుకోవచ్చు. కానీ ప్రపంచంలో మన రూపాయికి విలువే లేదు’ అని ఫైరయ్యారు.


