News August 4, 2024
షరతులకు కట్టుబడి ఉంటా బెయిలివ్వండి: హైకోర్టులో పిన్నెల్లి

AP: కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును కోరారు. పోలీసులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిిటిషన్‌ను కోర్టు రేపు విచారించనుంది. జూన్‌లో అరెస్టైన పిన్నెల్లి అప్పటి నుంచి నెల్లూరు జైల్లోనే ఉన్నారు. ఆయన దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లనూ కింది కోర్టు కొట్టేసింది.
Similar News
News March 29, 2026
IPL: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్

ఐపీఎల్-2026లో తొలి రెండు వారాల్లో జరిగే మ్యాచులకు ధోనీ దూరమైనట్లు CSK ఇటీవల ప్రకటించింది. కానీ ఆయన ఏప్రిల్ చివరి వారం వరకూ మ్యాచులు ఆడకపోవచ్చని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన దాదాపు 6 మ్యాచులకు దూరం కానున్నట్లు టీమ్ వర్గాలు చెప్పినట్లు తెలిపాయి. కాగా CSK రేపు RR, ఏప్రిల్ 3న PBKS, 5న RCB, 11న DC, 14న KKR, 18న SRH, ఏప్రిల్ 23న MIతో తలపడనుంది.
News March 29, 2026
మరో 2 రోజులే గడువు!

దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర మంత్రి అమిత్ షా విధించిన గడవు మరో 2 రోజుల్లో(మార్చి 31) ముగుస్తోంది. ఆపరేషన్ కగార్‌తో వందల మంది నేలకొరగగా, ఇంకెంతో మంది లొంగిపోయారు, లొంగిపోతున్నారు. ఇందులో తిప్పిరి తిరుపతి(దేవ్‌జీ), మల్లా రాజిరెడ్డి, మల్లోజుల, పాపారావు వంటి అగ్ర నేతలు ఉన్నారు. అయితే కీలక నేత గణపతి ఇంకా సరెండర్ కాలేదు. ఆయన నేపాల్‌లో ఉన్నారని ఈ నెల 31న లొంగిపోతారని వార్తలు వస్తున్నాయి.
News March 29, 2026
OTTలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. డేట్ ఇదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17 లేదా 24వ తేదీన ఈ మూవీని స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ ఈనెల 19న థియేటర్లలో విడుదలైంది.


