News August 1, 2024

తెలంగాణకు రైల్వే లైన్లు మంజూరు చేయండి: రఘునందన్

image

తెలంగాణకు కొత్త రైల్వేలైన్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్‌కు, కరీంనగర్ నుంచి హసన్‌పర్తి వరకు కొత్త లైన్లు ప్రారంభించాలని కోరారు. HYD MMTS విస్తరణపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర వాటా రాబట్టి ముందుకు తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News January 26, 2026

CCRHలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి(CCRH) 40 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, M.Pharm/MVSc, PG, MLT, PhD, ME/MTech, BE/BTech, NET/GPAT/GATE/RET ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 10, 11, 12, 13, 16, 17, 18, 24, మార్చి10తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: ccrhindia.ayush.gov.in

News January 26, 2026

ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలి: సీఎం

image

AP: పాలనలో టెక్నాలజీని వినియోగించి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని CM చంద్రబాబు అధికారులకు సూచించారు. RTGSపై సమీక్షలో ఆయన మాట్లాడారు. 2026ను టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్‌గా మార్చాలన్నారు. ప్రభుత్వ సేవల్లోనూ AI పాత్ర పెరగాలని స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్‌తో 878 సేవలు అందుతున్నాయని, ఇప్పటివరకు 1.43 కోట్ల మంది వినియోగించుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు.

News January 26, 2026

ఆపరేషన్ సిందూర్.. పాక్ గాలి తీసిన స్విస్ థింక్ ట్యాంక్!

image

ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌దే విజయమని స్విస్ థింక్ ట్యాంక్ CHPM తేల్చి చెప్పింది. ప్రారంభంలో పాక్ హడావిడి చేసినా తర్వాత ఇండియన్ ఎయిర్ సుపీరియారిటీ ముందు తలవంచక తప్పలేదని పేర్కొంది. ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్‌ను మన వాయుసేన పూర్తిగా ధ్వంసం చేసి పాక్ ఎయిర్ బేస్‌లను కోలుకోలేని దెబ్బకొట్టిందని తేల్చింది. భయపడి 4 రోజుల్లోనే పాక్ Ceasefire కోరుకున్నట్లు తెలిపింది. భారత్‌ది బలమైన ప్రతీకారమని పేర్కొంది.