News May 20, 2024
మీ ప్రేమకు కృతజ్ఞుడను: ఎన్టీఆర్

తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, ఇండస్ట్రీ మిత్రులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రియమైన అభిమానులారా.. నా ప్రయాణంలో మొదటి రోజు నుంచి మీరు అందించిన మద్దతుకు ధన్యవాదాలు. మీ అసమానమైన ప్రేమకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడై ఉంటాను. దేవర ఫస్ట్ సాంగ్కు అద్భుతమైన స్పందన లభించింది. శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
Similar News
News November 12, 2025
అలర్ట్.. వచ్చే వారం రోజులు జాగ్రత్త!

TG: రాబోయే వారం రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఆస్కారం ఉందని తెలిపింది. దీంతో జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులతో కూడిన సీజనల్ ఫ్లూ వ్యాప్తి చెందవచ్చని హెచ్చరించింది. గర్భిణులు, 65 ఏళ్లు పైబడిన వారు, 5 ఏళ్ల లోపు పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News November 12, 2025
భారత్కు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది: ఇజ్రాయెల్ పీఎం

ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనను ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఖండించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. భారత్కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ‘భారత్, ఇజ్రాయెల్ శాశ్వత సత్యాలపై ఆధారపడిన పురాతన నాగరికతలు. మన నగరాలపై దాడులు జరగొచ్చు. కానీ అవి మనల్ని భయపెట్టలేవు. ఇరు దేశాల వెలుగు శత్రువుల చీకట్లను తరిమేస్తుంది’ అని ట్వీట్ చేశారు.
News November 12, 2025
బిహార్లో NDAకు 121-141 సీట్లు: Axis My India

బిహార్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని Axis My India ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. NDAకు 121-141, MGBకు 98-118 సీట్లు వస్తాయని పేర్కొంది. ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పార్టీ 0-2 సీట్లకు పరిమితం అవుతుందని తెలిపింది. NDAకు 43%, MGBకి 41% ఓట్ షేర్ వస్తుందని వివరించింది. అటు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ NDA కూటమే గెలుస్తుందని అంచనా వేశాయి.


