News September 27, 2024
మీ స్పందనకు కృతజ్ఞుడిని: NTR

ఈరోజు రిలీజైన దేవర సినిమాకు వస్తున్న స్పందనపై స్టార్ యాక్టర్ జూ.ఎన్టీఆర్ స్పందించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు మొత్తానికి వచ్చేసిందని, అభిమానుల అపురూపమైన స్పందనలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నానని ట్వీట్ చేశారు. డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాతలకు, డీఓపీకి థాంక్స్ చెప్పారు. అనిరుధ్ అందించిన మ్యూజిక్‌పైనా ప్రశంసలు కురిపించారు. అభిమానుల ప్రేమకు రుణపడి ఉంటానని, ఇలాగే అలరిస్తుంటానని రాసుకొచ్చారు.
Similar News
News November 21, 2025
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: NZB కలెక్టర్

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చా తప్పక పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని NZB కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి నోడల్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికలను సాఫీగా నిర్వహించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.
News November 21, 2025
గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 33 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఖాన్ యూనిస్ సిటీలో గురువారం జరిగిన దాడుల్లో 33 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. OCT 11న సీజ్‌ఫైర్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి Israel దాడుల్లో కనీసం 211 మంది చనిపోయారని, 597 మంది గాయపడ్డారని పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం వల్ల ఎలాంటి మార్పూ రాలేదని, దాడులు కొనసాగుతూనే ఉన్నాయని పాలస్తీనియన్లు ఆవేదన చెందుతున్నారు.
News November 21, 2025
APPLY NOW: CLRIలో ఉద్యోగాలు

CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CLRI)14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 22లోపు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc, BE, B.Tech, M.Tech, ఎంఫార్మసీ, MVSc, MCA, MBA ఉత్తీర్ణతతో పాటు NET/GATE అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. DEC 22న రాత పరీక్ష, 23న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.clri.org/


