News March 7, 2025
అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు గ్రాట్యుటీ పెంపు

AP: రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 62 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి గ్రాట్యుటీ పెంచి చెల్లించాలని నిర్ణయించింది. అంగన్వాడీ మెయిన్, మినీ వర్కర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.40 వేల చొప్పున సర్వీసు ముగింపులో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే మహిళా దినోత్సవ సభలో CM చంద్రబాబు ప్రకటన చేయనున్నారు.
Similar News
News October 17, 2025
ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి: HC

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ చెప్పాలని ఆదేశించింది. దీంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది చెప్పేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని ప్రభుత్వం, ఈసీ న్యాయస్థానాన్ని కోరగా హైకోర్టు ఇందుకు అంగీకరించింది. కాగా జీవో 9తో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ HCలో పిటిషన్లు దాఖలవగా జీవోపై స్టే ఇవ్వడం తెలిసిందే.
News October 17, 2025
మరోసారి బ్యాంకుల విలీనం!

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో(PSB) మరో మెగా విలీనానికి రంగం సిద్ధమవుతోంది. చిన్న బ్యాంకులైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రను SBI, PNB, BOBలో విలీనం చేసే ఫైల్ త్వరలో PM కార్యాలయానికి చేరనుంది. దీంతో PSBల సంఖ్య 8 కానుంది. ఆర్థిక సంస్కరణలు, ఫిన్టెక్ కంపెనీలు, ప్రైవేటు బ్యాంకుల పోటీని తట్టుకోవడానికి ఈ విలీనం తప్పనిసరని కేంద్రం భావిస్తోంది.
News October 17, 2025
లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత ఆశన్న

మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ ఎదుట ఆ పార్టీ అగ్రనేత ఆశన్న(తక్కెళ్లపల్లి వాసుదేవరావు) లొంగిపోయారు. ఆయన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అటు బస్తర్ జిల్లా జగదల్పుర్లో 208 మంది మావోయిస్టులు సైతం అస్త్ర సన్యాసం చేశారు. వారిలో 98 మంది పురుషులు, 110 మంది మహిళలు ఉన్నారు. వారి వద్ద ఉన్న 153 తుపాకులు, 11 గ్రానైడ్ లాంచర్లను అప్పగించారు.