News February 27, 2026
GREAT.. ‘ఆర్ఎంసీ’లో భూపాలపల్లి సౌమ్య ప్రతిభ

రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఎంసీ) ప్రవేశ పరీక్షలో జయకేతనం ఎగరేసి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బౌసింగ్ పల్లికి చెందిన చిందం సౌమ్య సత్తా చాటారు. దక్షిణ భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక బాలికగా ఆమె రికార్డు సృష్టించారు. భవిష్యత్తులో ఆర్మీలో ఉన్నత అధికారిణిగా సేవలు అందించడమే తన లక్ష్యమని సౌమ్య పేర్కొన్నారు. ఈ విజయంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News April 12, 2026
VJA: శిరిడీ వెళ్లే ప్రయాణికులకు అలర్ట్!

మచిలీపట్నం-సాయినగర్ శిరిడీ (17208) రైలు మార్గంలో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా మే 5న ఈ రైలును విజయవాడ-ఖాజీపేట మార్గానికి బదులుగా, విజయవాడ-గుంటూరు మీదుగా దారి మళ్లించారు. దీనివల్ల ఖమ్మం, వరంగల్, ఖాజీపేట సహా పలు ప్రధాన స్టేషన్లలో ఆ రోజు రైలు నిలవదని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
News April 12, 2026
ఇంటర్ రిజల్ట్స్.. ఉమ్మడి ADB ర్యాంకులు ఇవే

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మిశ్రమ ఫలితాలను కనబరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన ర్యాంకుల్లో ఆసిఫాబాద్ జిల్లా 82.16% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 3వ స్థానాన్ని కైవసం చేసుకొని సత్తా చాటింది. మరోవైపు నిర్మల్ జిల్లా 73.43% (13వ ర్యాంకు), మంచిర్యాల 71.63% (19వ ర్యాంకు) సాధించగా, ఆదిలాబాద్ జిల్లా 62.50% ఉత్తీర్ణతతో 33వ స్థానానికి పరిమితమైంది.
News April 12, 2026
కొత్తగూడెం: 991 మార్కులు సాధించిన సాత్విక

కొత్తగూడెం టౌన్ హనుమాన్ బస్తీకి చెందిన సాత్విక నేటి ఇంటర్ ఫలితాల్లో 991 మార్కులు సాధించారు. బైపీసీ గ్రూపులో వైరా ప్రభుత్వ గురుకుల మహిళా కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సంతోష్, రేణుక దంపతుల కుమార్తె సాత్విక అత్యుత్తమ మార్కులు సాధించడంతో కళాశాల ఉపాధ్యాయ, సిబ్బంది, విద్యార్థులు, కొత్తగూడెం పట్టణవాసులు ప్రత్యేకంగా అభినందించారు.


