News April 3, 2025

GREAT: గ్రూప్ 1లో మెరిసిన పాలమూరు ఆణిముత్యం

image

మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన శ్రీనివాస్ గౌడ్ కుమార్తె నందిని కలాల్‌ గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటారు.TSPSC గ్రూప్-1 పరీక్షలో 467 మార్కులతో సత్తా చాటి తొలి ప్రయత్నంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే 281వ ర్యాంకు సాధించారు. గ్రూప్-2, 3లో కూడా ఆమె అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు Way2Newsకు తెలిపారు. గ్రూప్-1లో ఎంపిక కావడం సంతోషంగా ఉందని,UPSC తన లక్ష్యమంటూ పేర్కొన్నారు. #CONGRATULATIONS

Similar News

News November 18, 2025

బాలానగర్: ఫోన్‌పే చేస్తే.. ఖాతాలో రూ.28 వేలు మాయం

image

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపులో ఫోన్‌పే ద్వారా రూ.1,260 పంపగా.. కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న రూ.28 వేలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై సూచించారు.

News November 17, 2025

బాలానగర్‌లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్‌లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.