News April 25, 2024
GREAT.. మన సంగారెడ్డి యువకుడు సైంటిస్ట్ అయ్యాడు
ఝరాసంగం మండలం కమాల్‌పల్లికి చెందిన శ్రీశైలం వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. సామాన్య కుటుంబంలో పుట్టి సాగుపై మక్కువతో చదివిన శ్రీశైలం.. ISRB నిర్వహించిన జాతీయ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక పరీక్షల ఫలితాల్లో సత్తా చాటారు. అరుణాచల్‌ప్రదేశ్ కేడర్ వ్యవసాయ శాస్త్రవేత్త(ఏఎస్‌ఆర్‌బీ)గా ఉద్యోగం సాధించారు. శ్రీశైలం విద్యాభ్యాసం 10వ తరగతి వరకు ఝరాసంగం పాఠశాలలో జరిగింది. -CONGRATS
Similar News
News January 20, 2025
మెదక్: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి
విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లదేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. అందోల్ నియోజకవర్గాన్ని విమెన్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే నర్సింగ్ కాలేజీ కూడా ప్రారంభించామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారని, వారందరి బాగోగులు చూసుకోవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు.
News January 19, 2025
డబ్బా కొట్టడం మానేసి పాలనపై దృష్టి పెట్టండి: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలపై ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు అమలు చేశామని ఢిల్లీకి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారూ.. మీ పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న దుస్థితి నెలకొందని తెలిపారు. ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన మీకు చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు.
News January 18, 2025
BREAKING.. మెదక్: అన్నను చంపిన తమ్ముడు
మెదక్ జిల్లా శివంపేట మండలం నాను తండాలో తమ్ముడు అన్నను హత్య చేశాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన అన్నదమ్ములు శంకర్ (28), గోపాల్ రాత్రి ఒకే రూంలో పడుకున్నారు. తెల్లవారుజామున అన్న కాలికి కరెంట్ వైర్ చుట్టి విద్యుత్ షాక్ పెట్టాడు. శంకర్ కేకలు వేయడంతో గోపాల్ పారిపోయాడు. తండ్రి వచ్చి చూసే వరకే శంకర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.