News April 14, 2024

GREAT.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌తో అంబేడ్కర్ చిత్రం

image

అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాజ్యాంగంలోని 448 ఆర్టికల్స్‌తో గీసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటం విశేషంగా ఆకట్టుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెనికేరుకు చెందిన యార్లగడ్డ రాజారావు రాజ్యాంగంలోని 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 విభాగాలు, 128 సవరణలతో అంబేడ్కర్ చిత్రపటం రూపొందించారు. ఈ చిత్రపటాన్ని 2 రోజుల 11గంటల వ్యవధిలో గీసినట్లు రాజారావు చెప్పారు. రాజారావును పలువురు అభినందించారు.

Similar News

News November 23, 2024

రాజవొమ్మంగి: 35 గోల్డ్ మెడల్స్ గెలిచిన ఒకే పాఠశాల విద్యార్థులు

image

తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ఏకలవ్య పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో 35 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారని ప్రిన్సిపల్ కృష్ణారావు శనివారం మీడియాకు తెలిపారు. అరకులో జరిగిన జూడో, వెయిట్ లిఫ్టింగ్, యోగా, వాలీబాల్ క్రీడల్లో విజేతలుగా నిలిచారని చెప్పారు. విజేతలతోపాటు వారికి శిక్షణ ఇచ్చిన సిబ్బందిని సైతం ప్రిన్సిపల్, టీచర్స్ అభినందించారు.

News November 23, 2024

లక్కీఛాన్స్ కొట్టిన పి.గన్నవరం వాయిస్ ఆర్టిస్టు

image

నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, నెట్ ఫ్లెక్స్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ప్రచారం కానున్న ఆజాదీకా అమృత కహానియా డాక్యుమెంటరీకి తెలుగు భాష నుంచి వాయిస్ ఆర్టిస్టుగా పి.గన్నవరానికి చెందిన అడ్డగళ్ల రాధాకృష్ణను శుక్రవారం ఎంపిక చేశారు. 8 భాషలకు 8 మందిని బెస్ట్ వాయిస్ ఆర్టిస్టులను ఎంపిక చేయగా తెలుగు భాష నుంచి ఆ అవకాశం రాధాకృష్ణకు దక్కింది. ఈయన గతంలో పలు టీవీల్లో న్యూస్ రీడర్‌గా పనిచేశారు.

News November 23, 2024

పిఠాపురం ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి ఛైర్మన్‌గా కాకినాడ కలెక్టర్ వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నియోజకవర్గ MLAగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచాక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని గతంలో చెప్పిన విషయం తెలిసిందే.