News October 22, 2024
GREAT: వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలకు కామారెడ్డి బిడ్డ

కామారెడ్డి జిల్లా పిట్లం మండలకేంద్రానికి చెందిన తక్కడ్పల్లి ప్రతిభ వరల్డ్ ఛాంపియన్ షిప్ చెస్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ నెల 23 నుంచి 28 వరకు ఆర్మేనియా దేశం, ఏరేవాన్లో జరగనున్న 6వ ప్రపంచ స్థాయి చేస్ బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి. కామారెడ్డి జిల్లా నుంచి ప్రపంచ స్థాయి క్రీడల్లో పాల్గొనడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
☛ ALL THE BEST PRATIBA
Similar News
News September 16, 2025
టీయూ ఎం.ఎడ్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సెప్టెంబర్/అక్టోబర్-2025లో నిర్వహించనున్న ఎం.ఎడ్ 2వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు సెప్టెంబర్ 20లోపు ఫీజులు చెల్లించవచ్చని, రూ.100 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 22 వరకు గడువు ఉంటుందని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే.సంపత్ కుమార్ తెలిపారు. వివరాలకు www.telanganauniversity.ac.inను సందర్శించాలని సూచించారు.
News September 16, 2025
నిజామాబాద్: ఈ నెల 17 నుంచి పోషణ మాసం

పిల్లల పెరుగుదలకు, పోషణ లోపం తగ్గించుట, బరువు లోపం లేకుండా పోషక ఆహారాలను అందించుటలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోషణ మాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
News September 16, 2025
నిజామాబాద్: విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి: సీపీ

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ఇంజినీర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటితరం ఇంజినీర్లు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముందుగా విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజినీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.