News November 17, 2024

GREAT.. సిరిసిల్ల: రైతు బిడ్డకు గ్రూప్-4 ఉద్యోగం

image

సిరిసిల్ల జిలా తంగళ్లపల్లి మండలానికి చెందిన ఓ రైతు బిడ్డ గ్రూప్-4 ఉద్యోగం సాధించాడు. అంకుసాపూర్ గ్రామానికి చెందిన కొమురయ్య కుమారుడు రాజ్‌కుమార్‌కు గతంలో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ ఉద్యోగం వదులుకొని పై ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారు. SI ఉద్యోగం మెయిన్స్‌లో 4 మార్కులతో చేజారింది. అయినా పట్టు వదలకుండా చదివి గ్రూప్-4 ఉద్యోగం(రెవెన్యూశాఖ) జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించారు.

Similar News

News December 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ప్రధానాంశాలు

image

☞ పంచాయతీ అవార్డు అందుకున్న పెద్దపల్లి కలెక్టర్
☞ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న సీఎం క్రికెట్ కప్
☞ గ్రూప్-2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి: కరీంనగర్ కలెక్టర్
☞ హుస్నాబాద్‌లో బైక్ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నేతలు
☞ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా గీతా జయంతి వేడుకలు
☞ ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్
☞ ఎల్కతుర్తి: పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్

News December 11, 2024

KNR: గ్రూప్-2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈనెల 15, 16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గ్రూప్-2 పరీక్షకు విధులు కేటాయించిన అధికారులకు బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదన్నారు.

News December 11, 2024

సిరిసిల్ల: ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు: ఎస్పీ

image

సిరిసిల్ల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3 నెలల పాటు సీసీటీవీ ఇన్‌స్టాలేషన్, సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. టెన్త్ సర్టిఫికెట్‌తో ఈనెల 12  నుంచి 15 వరకు వారి పరిధి పోలీస్ స్టేషన్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.