News August 28, 2025

GREAT: కబడ్డీ ఇండియా క్యాంపుకు పాలమూరు బిడ్డ ఎంపిక

image

NGKL జిల్లా పదర మండలానికి చెందిన బండి నందిని, మహిళల కబడ్డీ అండర్-18 విభాగంలో ఇండియా క్యాంపునకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ Way2Newsతో తెలిపారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన నందిని, గురువారం ఢిల్లీలోని సోనీపత్‌లో జరిగే ఇండియా క్యాంపునకు బయలుదేరి వెళ్లారు. ఆమె తల్లిదండ్రులు రమేశ్, రామాదేవి సంతోషం వ్యక్తం చేశారు.

Similar News

News August 28, 2025

MBNR: భూ భారతి దరఖాస్తులను పరిష్కరించండి: కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లాలో రెవెన్యూ సదస్సుల సందర్భంగా అందిన భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహశీల్దార్లతో సమావేశమైన ఆమె, దరఖాస్తుల్లో ఉన్న మార్పులు, చేర్పులు, మ్యుటేషన్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కూడా పాల్గొన్నారు.

News August 28, 2025

జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలం జానంపేటలో 29.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. భూత్పూర్ మండలం కొత్త మొల్గర 24.5, అడ్డాకుల 23.5, కౌకుంట్ల 8.8, మహబూబ్‌నగర్ అర్బన్ 6.8, గండీడ్ మండలం సల్కర్ పేట 5.5, కోయిలకొండ 5.0, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 4.5, బాలానగర్ 3.8 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది.

News August 27, 2025

కొత్త మొల్గరలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 91.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. కోయిలకొండ మండలం పారుపల్లి 76.3, MBNR అర్బన్ 62.0, భూత్పూర్ 55.3, మహమ్మదాబాద్ 49.0, మిడ్జిల్ 48.8, జడ్చర్ల 45.0, రాజాపూర్ 43.8, నవాబుపేట 34.5, బాలానగర్ 31.3, మూసాపేట 28.0, కౌకుంట్ల 25.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.