News September 4, 2024

గ్రేట్: 185మంది పేదపిల్లలకు అతడు అండాదండ..!

image

ఢిల్లీకి చెందిన అమిత్ లాథియా ఓ సాదాసీదా కానిస్టేబుల్‌. అయితేనేం.. 12 ఏళ్లుగా ప్రతి నెలా తన జీతం వెచ్చించి నిరుపేద పిల్లలకు అండగా నిలుస్తున్నారు. పనులు చేసుకునే 185మంది పిల్లలు ఆయన చలవతో నేడు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పేద విద్యార్థులను గుర్తించడం, ఉచితంగా ఆహారం, నివాసం, స్టడీ మెటీరియల్స్ అందించి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం.. ఇదే అమిత్ పని. తన భార్య కూడా ఈ విషయంలో ఆయనకు అండగా ఉన్నారు.

Similar News

News February 3, 2025

BREAKING: తెలుగు నిర్మాత ఆత్మహత్య

image

సినీ నిర్మాత, డ్రగ్ పెడ్లర్ కేపీ చౌదరి (కృష్ణప్రసాద్ చౌదరి) గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆర్థిక పరిస్థితుల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి 2016లో సినిమా రంగంలోకి వచ్చారు. తెలుగులో కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. 2023లో ఆయన దగ్గర 93 గ్రా. కొకైన్ దొరకడంతో పోలీసులు అరెస్టు చేశారు.

News February 3, 2025

ట్రంప్ సుంకాలు.. ఆందోళన లేదు: ఆర్థిక మంత్రి నిర్మల

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘సుంకాల గురించి ఎలాంటి ఆందోళనా లేదు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. పరోక్షంగా ప్రభావం ఉండొచ్చు. మా ప్రధాన లక్ష్యం ఆత్మనిర్భరతే’ అని పేర్కొన్నారు.

News February 3, 2025

నిధులు కేటాయించండి: పనగరియాకు చంద్రబాబు విజ్ఞప్తి

image

ఢిల్లీ పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అర్వింద్ పనగరియాను ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ కలిశారు. రాష్ట్రానికి కేటాయించే ఆర్థిక సంఘం నిధుల అంశంపై ఆయనతో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం, నిధుల కేటాయింపులో పెద్ద మనస్సు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసిందని పనగరియా వద్ద నేతలు ప్రస్తావించారు.