News August 24, 2024
గ్రేట్.. కుక్క జ్ఞాపకార్థం సైకిల్‌పై 4వేల కి.మీల ప్రయాణం!

అమెరికన్ సైకిలిస్ట్ క్రిస్టీ బెల్మెర్ తన పెంపుడు కుక్క జ్ఞాపకార్థం సైకిల్‌పై 4,707 కిలోమీటర్లు ప్రయాణించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ప్రారంభించి జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం గుండా సాగి తిరిగి స్టార్టింగ్ పాయింట్లో ముగించారు. ఈ పూర్తి రైడ్ GPS మ్యాప్ చూస్తే కుక్క ఆకారంలో ఉంటుంది. కుక్క పుట్టినరోజైన మే 1న రైడ్ స్టార్ట్ చేసినట్లు ఆమె తెలిపారు.
Similar News
News September 17, 2025
శుభ సమయం (17-09-2025) బుధవారం

✒ తిథి: బహుళ ఏకాదశి రా.1.25 వరకు
✒ నక్షత్రం: పునర్వసు ఉ.9.43 వరకు
✒ శుభ సమయములు: ఉ.9.45-ఉ.10-08, సా.7.10-సా.7.40
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.7.30-ఉ.9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
✒ వర్జ్యం: సా.5.29-సా.7.02
✒ అమృత ఘడియలు: ఉ.7.24-ఉ.8.56
News September 17, 2025
TODAY HEADLINES

★ ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టుల ప్రకటన
★ రాహుల్ గాంధీపై పాక్ మాజీ క్రికెటర్ ఆఫ్రిది ప్రశంసలు
★ ప్రైవేట్ హాస్పిటళ్లపై సీఎం రేవంత్ ఆగ్రహం
★ 15% వృద్ధి రేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
★ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో కాంగ్రెస్ ఎంపీల ఓట్లను రేవంత్ అమ్ముకున్నారు: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
★ వివేకా హత్య కేసులో దర్యాప్తుకు సిద్ధం: సీబీఐ
★ పంటల ధరల పతనంలో చంద్రబాబు రికార్డు: YS జగన్
News September 17, 2025
‘నా మిత్రుడు ట్రంప్’కు ధన్యవాదాలు: PM మోదీ

ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం అమెరికా చేసే చొరవలకు మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ‘నా 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ధన్యవాదాలు. మీలాగే, నేను కూడా భారతదేశం-అమెరికా సమగ్ర, ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.