News September 15, 2024
GREAT.. అమ్మనాన్నలపై అభిమానాన్ని చాటుకున్న ఆటోడ్రైవర్

సాధారణంగా చాలా మంది ఆటో డ్రైవర్లు తమ వాహనం వెనకాల చిత్ర విచిత్రమైన పోస్టర్లను అంటించుకుంటారు. అయితే ఈ డ్రైవర్ మాత్రం డిఫరెంట్. తన ఆటోపై అమ్మనాన్న ఫొటోను ఉంచుకొని వారి పట్ల ప్రేమను వెల్లడించారు. ఈ ఫొటోను ఓ నెటిజన్ షేర్ చేశారు. కని, పెంచిన వాళ్లను అనాథలుగా వదిలేస్తున్న ఈ సమాజంలో తల్లిదండ్రులపై ప్రేమను ఇలా వ్యక్తపరిచేవారు కూడా ఉంటారని రాసుకొచ్చారు.
Similar News
News January 22, 2026
జనవరి 22: చరిత్రలో ఈ రోజు

1882: స్వాతంత్ర్య సమరయోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జననం
1885: ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు జననం
1918: కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటు
1940: తెలుగు భాషావేత్త గిడుగు రామమూర్తి మరణం
1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది
2014: సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరణం (ఫొటోలో)
News January 22, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 22, 2026
టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి: లోకేశ్

జెరోదా ఫౌండర్ నిఖిల్ కామత్‌తో మంత్రి లోకేశ్ దావోస్‌లో భేటీ అయ్యారు. ‘ప్లాట్‌ఫామ్ ఇంజినీరింగ్, ట్రేడింగ్ అల్గారిథమ్స్‌పై దృష్టి సారిస్తూ విశాఖలో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ నెలకొల్పండి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకో సిస్టమ్ బలోపేతానికి లీడ్ మెంటర్‌గా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో భాగస్వామ్యం వహించండి. కాలేజ్ స్థాయి వరకు ఫైనాన్సియల్ లిటరసీ కార్యక్రమం అమలుకు సహకరించండి’ అని విజ్ఞప్తి చేశారు.


