News February 15, 2025
GREAT… చాయ్ ఓనర్ టూ మున్సిపల్ మేయర్

రాయగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జీవర్ధన్ చౌహాన్ ఘన విజయం సాధించారు. దీంతో ఇన్నాళ్లూ నగరంలో ‘టీ దుకాణం’ నడిపిన వ్యక్తి మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ తమ మేయర్ అభ్యర్థిగా జీవర్ధన్ ను ప్రకటించింది. సీఎం సైతం తన దుకాణంలో టీ అమ్ముతూ ప్రచారం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో పది మున్సిపల్ కార్పొరేషన్లను గెలిచి బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది.
Similar News
News November 2, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, యాదాద్రి, నల్గొండలో వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు. HYDలో సాయంత్రం నుంచి వాన పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు పడే ఆస్కారమున్నట్లు వివరించారు.
News November 2, 2025
రైల్‌టెల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News November 2, 2025
వీళ్లు తీర్థయాత్రలు వెళ్లాల్సిన పని లేదు

కార్తీక వ్రత మహత్యం చాలా గొప్పదని పండితులు చెబుతున్నారు. ‘భూమ్మీదున్న పుణ్యక్షేత్రాలన్నీ కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి. ఇంద్రాదులు కూడా ఈ వ్రతస్థులను సేవిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన చోటు నుంచి గ్రహ, భూత పిశాచ గణాలు పారిపోతాయి. నిష్ఠగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం ఆ బ్రహ్మకే సాధ్యం కాదు. ఈ కార్తీక వ్రతాన్ని విడువక ఆచరించేవారు తీర్థయాత్రల అవసరమే లేదు’ అని అంటున్నారు. <<-se>>#Karthikam<<>>


