News September 28, 2024
GREAT DECISION: చెవిటి వారికీ అర్థమయ్యేలా..

నేషనల్ స్టేక్‌హోల్డర్స్ కన్సల్టేషన్‌లో ‘వైకల్యంతో జీవించే పిల్లల హక్కులను పరిరక్షించడం’పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రసంగిస్తున్నారు. ఇందులో CJI జస్టిస్ చంద్రచూడ్, కేంద్ర మంత్రి అన్నపూర్ణ పాల్గొన్నారు. అయితే మూగ, చెవిటి వారికి కూడా ఈ ప్రసంగాలు అర్థమయ్యేలా సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్‌ను ఏర్పాటుచేశారు. వైకల్యంతో ఉన్న స్త్రీలలో 80% మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారని జస్టిస్ నాగరత్న చెప్పారు.
Similar News
News December 9, 2025
శబరిమల: 18 మెట్లు – వాటి పేర్లు

1.అణిమ, 2.లఘిమ, 3.మహిమ, 4.ఈశత్వ, 5.వశత్వ, 6.ప్రాకామ్య, 7.బుద్ధి, 8.ఇచ్ఛ, 9.ప్రాప్తి, 10.సర్వకామ, 11.సర్వ సంవత్సర, 12.సర్వ ప్రియకర, 13.సర్వ మంగళాకార, 14.సర్వ దుఃఖ విమోచన, 15.సర్వ మృత్యుత్వశమన, 16.సర్వ విఘ్న నివారణ, 17.సర్వాంగ సుందర, 18.సర్వ సౌభాగ్యదాయక. ఈ 18 పేర్లు సిద్ధులు, సర్వ శుభాలకు ప్రతీక. ఇవి దాటితే అన్ని రకాల సౌభాగ్యాలను, విఘ్న నివారణను పొందుతారని నమ్మకం. <<-se>>#AyyappaMala<<>>
News December 9, 2025
క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు.. రస్సెల్

విండీస్ ఆల్‌రౌండర్ రస్సెల్ చరిత్ర సృష్టించారు. T20లలో 5000+ రన్స్, 500+ సిక్సులు, 500+ వికెట్లు సాధించిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించారు. అన్ని దేశాల లీగ్‌లలో కలిపి రస్సెల్ 576 మ్యాచ్‌లు ఆడారు. మొత్తంగా 9,496 రన్స్, 972 సిక్సర్లు, 628 ఫోర్లు బాదారు. కాగా వ్యక్తిగతంగా 126 మంది 5000+ రన్స్, ఆరుగురు 500+ వికెట్లు, 10 మంది 500+ సిక్సర్లు బాదారు. కానీ ఇవన్నీ చేసిన ఒకేఒక్కడు రస్సెల్.
News December 9, 2025
డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు: కేటీఆర్

TG: తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు DEC 9 అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గుర్తుచేశారు. ‘అమరుల త్యాగం, KCR ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించి నేటికి 16 ఏళ్లు. నవంబర్ 29(దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9(విజయ్ దివస్) లేదు. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు. జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.


