News August 27, 2024
GREAT: ఇండియాలో తొలిసారి!

HYDలోని AIG ఆస్పత్రి వైద్యులు INDలో తొలిసారి ఓ మహిళకు మెదడులో ఏర్పడిన కణితిని కంటి సాకెట్ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించారు. పుర్రె ఎముకను కట్ చేయకుండా న్యూరో-ఎండోస్కోప్ ద్వారా కంటిపైన చిన్న హోల్ చేసి మెదడు వద్దకు చేరుకుని సర్జరీ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా మెదడుపై ప్రభావం ఉండదని, చుట్టుపక్కనున్న కణజాలాలకు కూడా తక్కువ గాయాలు అవుతాయని వైద్యులు తెలిపారు. ప్రక్రియ పూర్తయిన రెండో రోజే డిశ్చార్జ్ చేశారు.
Similar News
News December 5, 2025
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. సీఎంలకు మంత్రుల ఆహ్వానం

TG: ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వ్యాపారవేత్తలతో పాటు పలు రాష్ట్రాల CMలకూ మంత్రులు ఆహ్వానం పలుకుతున్నారు. ఇవాళ AP CM చంద్రబాబును కోమటిరెడ్డి, TN CM స్టాలిన్ను ఉత్తమ్, ఝార్ఖండ్ CM హేమంత్ను భట్టి ఆహ్వానించారు. ‘CBN సీనియర్ నాయకుడు. ఆయన సలహా తీసుకుంటాం. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలి’ అని కోమటిరెడ్డి చెప్పారు.
News December 5, 2025
డే అండ్ నైట్ టెస్టుల్లో WORLD RECORD

ఆసీస్-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రెండో టెస్టు రెండో రోజు ఇరు జట్లు 7 వికెట్లు కోల్పోయి 387 రన్స్(Aus-378/6, Eng-9/1) చేశాయి. డే అండ్ నైట్ టెస్టుల్లో ఒక రోజులో నమోదైన అత్యధిక స్కోర్ ఇదే. 2019లో AUS-PAK 383/8 స్కోర్ చేశాయి. అలాగే ఇవాళ ఆసీస్ చేసిన 378 పరుగులు.. DN టెస్టులో ఒక టీమ్ ఒక రోజులో చేసిన అత్యధిక స్కోర్ కావడం విశేషం.
News December 5, 2025
పిల్లలు సినిమాల పిచ్చిలో పడకూడదు: పవన్

AP: సినిమాలు వినోదంలో ఓ భాగం మాత్రమేనని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. పిల్లలు ఆ సినిమాల పిచ్చిలో పడకుండా చూడాలని PTMలో పేరెంట్స్కి సూచించారు. గతంలో చదువుల కోసం దాతలు వందల ఎకరాలు దానమిచ్చారని గుర్తు చేశారు. నేడు ఉన్న స్థలాలు దోచుకుపోయే పరిస్థితి ఉందని, స్కూళ్లకు గ్రౌండ్స్ లేకపోవడం విచారకరమన్నారు. ‘సోషల్ టీచర్ చెప్పిన పాఠాలు నా గుండెలో నాటుకుపోయాయి. అవే నాలో సామాజిక బాధ్యతను పెంచాయి’ అని అన్నారు.


