News November 4, 2024
GREAT: ₹5000 నుంచి ₹50,000 కోట్లకు..
యంగ్ ఆంత్రప్రెన్యూర్స్‌కు Waree టెక్నాలజీ ఛైర్మన్ హితేశ్ చిమన్‌లాల్ ఆదర్శనీయం. కిరాణాకొట్టు యజమాని కొడుకైన ఆయన చదువుకుంటున్నప్పుడే 1985లో బంధువుల దగ్గర రూ.5000 అప్పు తీసుకొని జర్నీ ఆరంభించారు. 1989లో వ్యాపారం విస్తరించి తొలి ఏడాదిలో రూ.12వేల టర్నోవర్ సాధించారు. కట్‌చేస్తే 40ఏళ్ల తర్వాత కంపెనీ మార్కెట్ విలువ రూ.71,244 కోట్లకు చేరింది. IPOకు రావడంతో ఆయన కుటుంబ నెట్‌వర్త్ రూ.50వేల కోట్లను తాకింది.
Similar News
News December 9, 2024
త్వరలో ‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌పై అప్టేడ్ వచ్చింది. ‘ఫస్ట్ సింగిల్’ లోడింగ్ అంటూ బాలయ్యతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్న పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో అతి త్వరలోనే సాంగ్ రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
News December 9, 2024
పవన్ కళ్యాణ్‌ను చంపేస్తామని బెదిరింపులు
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బెదిరింపులు కలకలం రేపాయి. ఆయనను చంపేస్తానని ఓ అగంతకుడు డిప్యూటీ సీఎం ఆఫీసుకు మెసేజ్ పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు దీనిపై డిప్యూటీ సీఎం పేషీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.
News December 9, 2024
జమిలి ఎన్నికలు: ఈ సమావేశాల్లోనే బిల్లు!
జమిలి ఎన్నికల నిర్వహణకు NDA ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే సభ ముందుకు తెచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సభలో చర్చ అనంతరం దీనిపై JPCని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. Sep 18న రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ప్రతిపాదనలను క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే.