News April 16, 2024
GREAT: కష్టాల ప్రయాణం.. కోచింగ్ లేకుండా సివిల్స్ రెండో ర్యాంక్

ఇవాళ విడుదలైన సివిల్స్ ఫలితాల్లో దేశంలోనే రెండో ర్యాంక్ సాధించిన అనిమేశ్(ఒడిశా) జీవితంలోని కష్టాల ప్రయాణం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అతని తండ్రి 9ఏళ్ల కిందటే చనిపోయాడు. సరిగ్గా సివిల్స్ ఇంటర్వ్యూ సమయంలో తల్లి క్యాన్సర్‌తో మరణించింది. ఆ విషాదాన్ని దిగమింగి లక్ష్యం వైపు అడుగులు వేసి తొలి ప్రయత్నంలోనే సివిల్స్ క్లియర్ చేశారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా రోజుకు 5-6 గంటలు చదివానని అతను తెలిపారు.
Similar News
News January 27, 2026
భారత్-EU ఒప్పందాలపై ప్రధాని ట్వీట్

ఇండియా- యురోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం ఒక కీలక మైలురాయి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా పెట్టుబడులు & ఉపాధికి కొత్త మార్గాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూరప్ నేతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ భాగస్వామ్యం ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని ట్వీట్ చేశారు. ఈ చరిత్రాత్మక అడుగుతో IND-యూరప్ మధ్య సహకారం మరింత పెరగనుంది.
News January 27, 2026
భారత్ భారీ స్కోర్

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 352-8 స్కోర్ చేసింది. విహాన్ సెంచరీ(109*) బాదగా, అభిజ్ఞాన్ కుందు 61, వైభవ్ సూర్యవంశీ 52, ఆరోన్ 23, కెప్టెన్ ఆయుష్ మాత్రే(21), అంబ్రిష్ 21, ఖిలాన్ పటేల్ 30 రన్స్ చేశారు. కాగా గ్రూప్ స్టేజీలో హ్యాట్రిక్ విజయాలతో యంగ్ ఇండియా జోరుమీదున్న విషయం తెలిసిందే.
News January 27, 2026
19 ఇరిగేషన్ ప్రాజెక్టులకు మహర్దశ

AP: ప్రాధాన్యత వారీగా ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని CM ఆదేశించడం తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారులు 19 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వెలిగొండ, కొరిశపాడు, పాలేరు, మల్లెమడుగు, శ్రీబాలాజీ రిజర్వాయర్ వీటిలో ఉన్నాయి. కుప్పం, మడకశిర బ్రాంచ్ కెనాళ్లు, మూలపల్లి, హంద్రీనీవా, అట్లూరుపాడు, భైరవానితిప్ప, జీడిపల్లి అప్పర్ పెన్నార్, అన్నమయ్య, వేదవతి-గాజుల దిన్నెవంటి ప్రాజెక్టులను ముందు పూర్తి చేస్తారు.


