News October 23, 2024

GREAT.. 27 ఏళ్లుగా సెలవు తీసుకోలేదు!

image

ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా 27 ఏళ్లుగా ఉద్యోగం చేస్తోన్న మలేషియాకు చెందిన క్లీనర్ బాకర్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. కుటుంబ పోషణ, తన ముగ్గురు ఆడపిల్లలకు ఉన్నత చదువును అందించేందుకు ఆయన చేసిన శ్రమ వృథా కాలేదు. వారానికి ఏడు రోజులు పనిచేస్తూ పిల్లలను చదివించడంతో వారు న్యాయమూర్తి, డాక్టర్‌, ఇంజినీర్‌గా స్థిరపడ్డారు. పిల్లలు సెటిల్ అవడంతో ఇకనైనా రెస్ట్ తీసుకోవాలంటూ నెటిజన్లు ఆయన్ను కోరుతున్నారు.

Similar News

News January 6, 2026

కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి కన్నుమూత

image

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి(81) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణేలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈయన రెండుసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పీవీ నరసింహారావు క్యాబినెట్‌లో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(1996-2012), ఏషియన్ అథ్లెటిక్ అసోసియేషన్(2000-2013) అధ్యక్షుడిగానూ సేవలందించారు.

News January 6, 2026

లోకేశ్‌తో ఐకాన్ స్టార్ సినిమా ఫిక్స్?

image

అల్లు అర్జున్ మరోసారి తమిళ దర్శకుడితో సినిమా చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అట్లీతో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. ఆ షూటింగ్ పూర్తవగానే లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ప్రాజెక్టు ప్రారంభమవుతుందని టాలీవుడ్ టాక్. ఇటీవల లోకేశ్ హైదరాబాద్ వచ్చి ఐకాన్ స్టార్‌ను కలిసి మూవీపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నాలుగో చిత్రం కూడా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.

News January 6, 2026

గోదావరి పుష్కరాలకు సన్నాహాలు.. ఘాట్‌ల విస్తరణ

image

TG: 2027 గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. భద్రాచలం, మోతెగడ్డ, పర్ణశాల, చినరావిగూడెంలలో భక్తుల రాక కోసం స్నాన ఘాట్‌ల విస్తరణ, ప్రత్యేక సౌకర్యాల ఏర్పాటు, బారికేడింగ్, వాటర్‌ప్రూఫ్ టెంట్లు, మహిళల కోసం ప్రత్యేక వసతులు ప్లాన్ చేస్తున్నారు. 150 మీటర్ల భద్రాచలం ఘాట్‌ను మరో 150 మీటర్లు పెంచనున్నారు. ఇప్పటికే AP ప్రభుత్వం సైతం పుష్కరాలకు సన్నాహాలు చేస్తోంది.