News October 9, 2024

GREAT: 18 ఏళ్లకే ఎత్తైన శిఖరాలన్నీ ఎక్కేశాడు!

image

నేపాల్‌కు చెందిన నిమా రింజీ షెర్పా చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో 8వేల మీటర్లకంటే ఎత్తున్న 14 శిఖరాలనూ 18 ఏళ్లకే అధిరోహించారు. బుధవారం ఉదయం టిబెట్‌లోని 8027 మీటర్ల ఎత్తున్న శీష పంగ్మా పర్వత శిఖరాన్ని చేరుకోవడం ద్వారా ఈ రికార్డును అందుకున్నారు. ఈ పర్వత శిఖరాలను సమీపించేకొద్దీ మనిషికి సరిపడా ఆక్సిజన్ ఉండదు. ఈ నేపథ్యంలో ఈ 14 శిఖరాలను అధిరోహించడాన్ని పర్వతారోహకులు గొప్పగా చెబుతారు.

Similar News

News October 15, 2025

దారులు వేరైనప్పుడు KCR ఫొటో పెట్టుకోవడం కరెక్ట్ కాదు: కవిత

image

TG: కేసీఆర్ ఫొటో లేకుండానే ‘జాగృతి జనం బాట’ చేపట్టనున్నట్లు కవిత ప్రకటించారు. ‘ఆయన కడుపున పుట్టడం జన్మజన్మల అదృష్టం. కానీ దారులు వేరవుతున్నప్పుడు ఇంకా KCR పేరు చెప్పుకోవడం నైతికంగా కరెక్ట్ కాదు. చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. నేను వేరే తొవ్వ వెతుక్కుంటున్నా. గతంలో జాగృతి పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ఫొటో పెట్టకుండా జయశంకర్ ఫొటోనే పెట్టాం’ అని చెప్పారు.

News October 15, 2025

మేడిగడ్డ పునరుద్ధరణకు వడివడిగా అడుగులు

image

TG: వరదల్లో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు ప్రభుత్వం చురుగ్గా కదులుతోంది. పునరుద్ధరణ ప్లాన్, డిజైన్లకోసం బిడ్ల దాఖలు నేటితో ముగియనుంది. HYD, మద్రాస్, రూర్కీ IITలు టెండర్లు దాఖలు చేశాయి. మరికొన్ని ప్రముఖ సంస్థలు కూడా బిడ్లు వేసేందుకు రెడీగా ఉండడంతో గడువు పొడిగించడంపై ఆలోచిస్తోంది. NDSA సిఫార్సులకు అనుగుణంగా ఉన్న బిడ్‌ను ఆమోదించి నిర్మాణ పనులకు టెండర్లు పిలవనుంది.

News October 15, 2025

మొక్కజొన్న: కోతకు ముందు ఈ జాగ్రత్తలు..

image

మనుషులతోపాటు కోళ్లు, పశువులకు ఆహారం ఉపయోగించే ప్రధాన పంటల్లో మొక్కజొన్న ఒకటి. పంటను ఆశించే కాండం తొలుచు పురుగు, పేను బంక నివారణకు రైతులు పలు మందులను వాడుతుంటారు. అయితే కోత దగ్గర పడిన సమయంలో అనుమతికి మించి, సురక్షిత కాలాన్ని దాటి వాడటం మంచిది కాదు. వాడితే పంట ద్వారా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే పైన ఫొటోలో చూపినట్లుగా సురక్షిత కాలం, మోతాదును పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.