News October 9, 2025
GREAT: 969 కిలోల గుమ్మడికాయను పండించాడు

మన దగ్గర పండించే గుమ్మడికాయలు సాధారణంగా 3-5KGల బరువు ఉంటాయి. ఇంకా జాగ్రత్తగా పెంచితే 10-20KGల వరకు బరువు పెరగొచ్చు. రష్యాకు చెందిన అలెగ్జాండర్ చుసోవ్ అనే రైతు ఏకంగా 969 కిలోల అతిపెద్ద గుమ్మడికాయను పండించి రికార్డు సృష్టించారు. ఆరు నెలల పాటు శ్రమించి.. నేల, గాలిని వేడిచేసే ప్రత్యేక గ్రీన్ హౌస్‌ను నిర్మించి.. ఎరువులు, నీటిని కచ్చితమైన మోతాదులో అందించి ఈ గుమ్మడిని పండించినట్లు రైతు చుసోవ్ తెలిపారు.
Similar News
News February 16, 2026
TG: 7 కార్పొరేషన్లలో మేయర్, డి.మేయర్లు వీరే

⋆ కరీంనగర్: మేయర్-శ్రీనివాస్ (BJP), డిప్యూటీ మేయర్-సునీల్ రావు(BJP)
⋆ NZB: ఉమారాణి (కాంగ్రెస్), తహసీన్(MIM)
⋆ రామగుండం: మహంకాళి స్వామి(INC), పాతిపెల్లి ఎల్లయ్య(INC)
⋆ కొత్తగూడెం: మూడ్ గణేశ్(CPI), సిరిపురపు లలిత కుమారి (INC)
⋆ NLG: చైతన్య శ్రీనివాసరెడ్డి(INC), మహమ్మద్ అష్రఫ్ అలీ అమర్(INC)
⋆ MBNR: గుమల్ మమత(INC), సురేందర్ రెడ్డి(INC)
⋆ మంచిర్యాల: మధుకర్ (INC), రమ్య మహేశ్(INC)
News February 16, 2026
టెన్త్‌లో రెండు బోర్డు ఎగ్జామ్స్‌పై CBSE క్లారిటీ

పదో తరగతిలో రెండు బోర్డు ఎగ్జామ్‌ల పాలసీపై CBSE స్పష్టతనిచ్చింది. విద్యార్థులందరూ మొదటి బోర్డు పరీక్షలు రాయడం తప్పనిసరి అని పేర్కొంది. మొదటి బోర్డు పరీక్షల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజరు కాకపోతే రెండో బోర్డు పరీక్షలకు అనర్హులని తెలిపింది. ఇంప్రూవ్‌మెంట్, మొదటి బోర్డు పరీక్షల్లో ఫెయిలైన వారి కోసం మాత్రమే సెకండ్ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు వివరించింది.
News February 16, 2026
హంపి గ్యాంగ్ రేప్ కేసు.. ముగ్గురికి మరణశిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హంపి (కర్ణాటక) గ్యాంగ్ రేప్ కేసులో గంగావతి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముగ్గురు దోషులు మల్లేశ్, సాయి, శరణప్పలకు మరణశిక్ష విధించింది. 2025 మార్చిలో తుంగభద్ర నదీతీరంలో ఓ విదేశీ (ఇజ్రాయెల్) మహిళతో పాటు మరో మహిళ (హోమ్ స్టే ఆపరేటర్)పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితులతో ఉన్న ముగ్గురు స్నేహితులను నదిలోకి తోసేయడంతో ఒకరు చనిపోయారు.


