News December 17, 2024
GREAT: అతుల్ సుభాష్‌కు జంబో కింగ్ నివాళి

టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. భార్య వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన మరణ వాంగ్మూలంలో ఆరోపించారు. ఇదిలా ఉండగా.. జంబో కింగ్ ఔట్లెట్ అతడికి తమ బిల్లుల్లో నివాళులర్పించింది. ‘సుభాష్ మృతి చాలా బాధాకరం. అందరి జీవితంలాగే అతడి జీవితమూ చాలా విలువైనది. RIP బ్రదర్. నీ ఆత్మకు శాంతి చేకూరిందని భావిస్తున్నాం’ అని బిల్లులపై ముద్రించింది.
Similar News
News November 3, 2025
చెత్తవేసే వారి ఫొటోలు పంపిస్తే ₹250 నజరానా

నగర పరిశుభ్రతలో పౌరుల భాగస్వామ్యం కోసం గ్రేటర్ బెంగళూరు అథారిటీ, BSWML కొత్త స్కీమ్ చేపట్టాయి. రోడ్లపై చెత్తవేసే వారి ఫొటో, వీడియో తీసి పంపిస్తే ₹250 చెల్లిస్తామని ప్రకటించాయి. త్వరలోనే దీనికోసం డెడికేటెడ్ నంబర్, SM హ్యాండిల్స్, ప్రత్యేక యాప్ ఏర్పాటు చేయనున్నాయి. కాగా 5వేల ఆటోలతో ఇంటివద్దే చెత్త సేకరిస్తున్నా కొందరు ఇంకా రోడ్లపై వేస్తున్నారని, వారికి ₹2వేల ఫైన్ విధిస్తామని BSWML CEO తెలిపారు.
News November 3, 2025
నిద్రపోయే ముందు రీల్స్ చూస్తున్నారా?

చాలామంది రీల్స్ చూస్తూ నిద్రను పాడు చేసుకుంటున్నారని వైద్యులు గుర్తించారు. స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్‌ను అణచివేస్తుందని తెలిపారు. ‘నిరంతర ఉద్దీపన వల్ల మెదడు విశ్రాంతి తీసుకోకుండా చురుకుగా ఉంటుంది. దీని ఫలితంగా నిద్ర నాణ్యత తగ్గి, మరుసటి రోజు బ్రెయిన్ ఫాగ్, చిరాకు పెరుగుతాయి. అందుకే నిద్రకు 30-60 నిమిషాల ముందు రీల్స్, టీవీ చూడకండి’ అని సూచించారు.
News November 3, 2025
కంకర ఓవర్ లోడ్ కారణంగానే ప్రమాదం!

TG: చేవెళ్ల బస్సు ప్రమాదానికి సంబంధించి కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. కంకర ఓవర్‌లోడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనా సమయంలో టిప్పర్‌లోనే యజమాని లక్ష్మణ్ ఉన్నారు. లడారం-శంకర్పల్లి వరకు టిప్పర్‌ను ఆయనే నడిపారు. ఆ తర్వాత డ్రైవర్ ఆకాశ్‌కు ఇచ్చారు. గాయపడిన లక్ష్మణ్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కండక్టర్ రాధ ఫిర్యాదుతో చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు.


