News April 6, 2024
GREAT.. KNR జిల్లా వాసి అద్భుత ఆవిష్కరణ

చదివింది పదో తరగతి అయినప్పటికీ నూతన పరికరాలను తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన తిరుపతి. పదేళ్లు సింగపూర్‌లో ఉండి 20 రోజుల క్రితం స్వగ్రాయానికి వచ్చారు. రైతులకు ఉపోయోగపడేలా రూ.15వేల ఖర్చుతో 2 వారాల్లోనే సైకిల్ మోటార్‌ను తయారు చేశారు. లీటరు పెట్రోల్‌కు 20కి.మీ దూరం ప్రయాణించేలా రూపొందించాడు. కాగా, గతంలో గడ్డికోసే యంత్రం, పసుపు తవ్వే యంత్రాన్ని కూడా తయారుచేశాడు.
Similar News
News October 31, 2025
దంపతుల గల్లంతు.. మృతదేహాలు లభ్యం

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగులో వరద ప్రవాహానికి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లికి చెందిన <<18150389>>దంపతులు<<>> ఈసంపల్లి ప్రణయ్(28), కల్పన(24) గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు ఇవాళ ఉదయం దంపతుల మృతదేహాలను గుర్తించారు. కాగా, ప్రణయ్, కల్పనను విగతజీవులుగా చూసిన బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
News October 31, 2025
KNR: ‘చిట్ ఫండ్స్ వ్యవస్థ అనేది మన సమాజంలో ఆర్థిక సహకారం’

KNR జిల్లా చిట్‌ఫండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొదుపు దినోత్సవం నిర్వహించారు. ‘ఈరోజు మనం పొదుపు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది కేవలం ఒక ఆచార దినం కాదు. ఇది ప్రతి కుటుంబంలో ఆర్థిక శ్రద్ధ, భవిష్యత్ భద్రత, క్రమశిక్షణకు సంకేతం’ అని అధ్యక్షులు పెంట శ్రీనివాస్ అన్నారు. చిట్ ఫండ్స్ వ్యవస్థ అనేది మన సమాజంలో ఆర్థిక సహకారం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.
News October 31, 2025
సైదాపూర్: రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం: పొన్నం

సైదాపూర్ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు, నష్టపోయిన పంటలను మొత్తం రికార్డ్ చేయాలని అధికారులను ఆదేశించామని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి వెంట కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ అలం ఉన్నారు.


