News August 14, 2024

గ్రేట్.. తెలంగాణ నుంచి ఒక్కరే!

image

విధి నిర్వహణలో ధైర్యసాహసాలు కనబరిచిన తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్య ‘గ్యాలంట్రీ ప్రెసిడెంట్ మెడల్’కు ఎంపికయ్యారు. 2022లో కేసు విచారణలో చైన్ స్నాచర్లు యాదయ్యపై కత్తితో దాడి చేశారు. కత్తిపోట్లకు గురైనా వారిని నిలువరించి పట్టుకునేందుకు ఆయన ప్రయత్నించారు. రాష్ట్రపతి శౌర్య పురస్కారానికి ఎంపికైన ఏకైక పోలీస్ అధికారిగా నిలిచిన యాదయ్యని డీజీపీ జితేందర్ సన్మానించారు.

Similar News

News November 28, 2025

కరీంనగర్: 2019 సం.లో 108.. మరి ఇప్పుడు..?

image

2019 స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1210 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 108 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో KNRలో 15, PDPలో 13, JGTLలో 37, SRSLలో 43 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే, ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల నిధులు కేటాయిస్తామనటంతో, ఈ నిధులతో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని అనుకున్న నాయకుల ఆశలపై అప్పటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నీళ్లు చల్లింది.

నేడు కామారెడ్డికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న PDSU 23వ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరుకానున్నారు. PDSU జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లాలోని పీడీఎస్‌యూ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై, మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.