News August 7, 2024
GREAT: వయనాడ్ కోసం ప్రభాస్ రూ.2 కోట్లు

కేరళలోని వయనాడ్ విపత్తు బాధితుల పట్ల రెబల్‌స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. వారికి అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు విరాళమిచ్చినట్లు ఆయన టీమ్ ప్రకటించింది. ఇప్పటికే అల్లు అర్జున్ రూ.25 లక్షలు, చిరంజీవి, రామ్‌చరణ్ కలిపి రూ.కోటి ఇచ్చారు. అటు సూర్య, విక్రమ్, మమ్ముట్టి, మోహన్‌లాల్, నయనతార వంటి స్టార్స్ కూడా కేరళకు అండగా నిలిచారు.
Similar News
News September 14, 2025
ఏపీ వైద్యారోగ్యశాఖలో 538 పోస్టులు

<
News September 14, 2025
డయేరియా బాధితుల ఇళ్లకే హైజీన్ కిట్లు

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నిన్న బాధితులను మంత్రి నారాయణ పరామర్శించి అధికారులకు <<17697179>>ఆదేశాలు<<>> జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి హైజీన్ కిట్లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ‘డయేరియాపై అవగాహన కల్పిస్తున్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సహాయం కోసం 91549 70454కు కాల్ చేయండి’ అని సూచించారు.
News September 14, 2025
యానిమల్ లవర్స్‌పై ప్రధాని మోదీ సెటైర్లు

ఢిల్లీలో ఇటీవల వీధి కుక్కల తరలింపును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యానిమల్ లవర్స్ ఉద్యమించిన విషయం తెలిసిందే. వారి డబుల్ స్టాండర్డ్స్‌పై ప్రధాని మోదీ రీసెంట్గా ఓ ఈవెంట్లో సెటైర్లు వేశారు. ‘నేను ఇటీవల కొంతమంది యానిమల్ లవర్స్‌ను కలిశాను. మన దేశంలో అలాంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వారిలో ఎక్కువ మంది ఆవులను యానిమల్గా పరిగణించరు’ అని వ్యాఖ్యానించారు.