News December 14, 2024

GREAT: సైకిల్‌పైనే 41,400Kms వెళ్లిన రంజిత్

image

సైకిల్‌పై పక్కూరికి వెళ్లేందుకే కష్టమనుకునే వారున్న రోజుల్లో వరంగల్(TG)కి చెందిన రంజిత్ నాలుగేళ్లలో 41,400 KMS ప్రయాణించారు. తన తండ్రి 2020లో మరణించగా, ప్రపంచాన్ని చుట్టిరావాలనే ఆయన కలను తాను పూర్తిచేసేందుకు సిద్ధమయ్యారు. స్తోమత లేకపోవడంతో సైకిల్‌పైనే ఇప్పటివరకు 13 దేశాల్లో పర్యటించారు. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన AUSలో ఉండగా BGT మ్యాచుకు వెళ్లారు.

Similar News

News September 18, 2025

జుట్టు లేని కొబ్బరి కాయను కొట్టకూడదా?

image

దేవుడికి జుట్టు లేని కొబ్బరికాయను కొట్టకూడదని పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయ మన శరీరానికి ప్రతీక. దానిపై ఉన్న పీచు మనలోని అహంకారానికి, జ్ఞానానికి చిహ్నం. భగవంతునికి మన శరీరాన్ని, ఆత్మను సంపూర్ణంగా సమర్పించుకోవడానికి కొబ్బరికాయ కొడతాం. అందుకే జుట్టు ఉన్న కొబ్బరికాయనే కొట్టి, ఆత్మనివేదన అనే భక్తి మార్గాన్ని అనుసరించాలి. జుట్టు లేని కాయను సమర్పించడం అసంపూర్ణ సమర్పణగా భావిస్తారు.

News September 18, 2025

సాయిబాబా విగ్రహం పాలరాయితోనే ఎందుకు?

image

పాలరాయి ఆధ్యాత్మికంగా స్వచ్ఛతకు, బలానికి ప్రతీక. ఈ లక్షణాలు బాబా బోధనలకు అనుగుణంగా ఉంటాయి. పాలరాయి విగ్రహం ఉన్న చోట ప్రశాంతమైన, సామరస్య పూర్వక వాతావరణం ఏర్పడుతుందని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఇది సహజమైనది, ప్రాసెస్ చేయనిది కావడంతో పవిత్రంగా పూజా మందిరాల్లో ఉంచుకోవడానికి ఇష్టపడతారు. అనేక ఆలయాల్లోనూ పాలరాయితో చేసిన సాయిబాబా విగ్రహాలే మనకు దర్శనమిస్తుంటాయి.

News September 18, 2025

నవ గ్రహాలు – భార్యల పేర్లు

image

సూర్యుడు – ఉష, ఛాయ
చంద్రుడు – రోహిణి
కుజుడు – శక్తి దేవి
బుధుడు – జ్ఞాన శక్తి దేవి
గురుడు – తారా దేవి
శుక్రుడు – సుకీర్తి దేవి
శని – జేష్ఠా దేవి
రాహువు – కరాళి దేవి
కేతువు – చిత్రాదేవి