News April 11, 2025
GREAT: సో‘హిట్’ కావాలి

MPలోని జబల్పూర్కు చెందిన 11ఏళ్ల ఆర్చర్ సోహిత్ కుమార్ అండర్-15 జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్లో 720 పాయింట్లకు 710 పాయింట్లు సాధించి నేషనల్ రికార్డు సృష్టించారు. ఆయన తండ్రికి ఓ కాలు లేదు. చేతికర్రలు, తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తండ్రి కష్టాలను అధిగమిస్తుంటే, ఆ కష్టానికి ప్రతిఫలంగా సోహిత్ ఆర్చరీలో రికార్డులు నెలకొల్పుతున్నారు. 2028ఒలింపిక్స్ లక్ష్యం అంటున్నారు.
Similar News
News December 9, 2025
కృష్ణా: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో అక్టోబర్ 2025లో నిర్వహించిన బీ-ఫార్మసీ 2వ సెమిస్టర్(2025-26 అకడమిక్ ఇయర్) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 18వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.1,000 ఫీజు https://onlinesbi.com ద్వారా ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం సూచించింది.
News December 9, 2025
శోకం నుంచి శక్తిగా.. సోనియా ప్రస్థానం!

నేడు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు. భర్త రాజీవ్ గాంధీ మరణంతో పార్టీ పగ్గాలు చేపట్టి పురుషుల ఆధిపత్యం ఉన్న రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న పార్టీని అకుంఠిత దీక్షతో మళ్లీ అధికారంలోకి తెచ్చారు. పాలనలో తనదైన ముద్ర వేసి సుదీర్ఘకాలం దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. 2009లో ఇదే రోజున తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ ఆమె రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించారు.
News December 9, 2025
మేకప్ లేకుండా అందంగా ఉండాలంటే!

అందంగా కనిపించాలని అమ్మాయిలు ఖరీదైన ఉత్పత్తులు వాడుతుంటారు. ఇలా కాకుండా కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే సహజంగానే మెరిసిపోవచ్చంటున్నారు నిపుణులు. హెల్తీ ఫుడ్, తగినంత నిద్ర, మంచినీళ్లు తాగడం, సంతోషంగా ఉండటం వల్ల సహజంగా అందం పెరుగుతుందంటున్నారు. దీంతో పాటు బేసిక్ స్కిన్ కేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనికోసం నాణ్యమైన మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ వాడాలని చెబుతున్నారు.


