News February 7, 2025
గ్రేట్.. ఆరు నెలల బోనస్ ఇచ్చిన స్టార్టప్

ఉద్యోగుల విధేయతను గౌరవిస్తూ ఓ కంపెనీ వారికి 6 నెలల జీతాన్ని బోనస్‌గా ఇచ్చింది. TNలోని కోయంబత్తూరులో ఉన్న AI స్టార్టప్ ‘KOVAI.CO’ను శరవణ కుమార్ స్థాపించారు. మొత్తం 140 మంది ఉద్యోగులుండగా, వారికి రూ.14 కోట్లు బోనస్‌గా ఇచ్చారు. ‘స్టార్టప్‌లలో పనిచేసేందుకు ఎవరూ మొగ్గుచూపారు. మూడేళ్లు మాతో పనిచేస్తే 2025 జనవరి జీతంలో ఆరు నెలల బోనస్ ఇస్తానని ప్రకటించి ఆ మాటను నిలబెట్టుకున్నా’ అని శరవణ కుమార్ తెలిపారు.
Similar News
News November 24, 2025
GWL: ప్రజావాణిలో ఎస్పీకి 16 ఫిర్యాదులు వెల్లువ

గద్వాల జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు నేరుగా 16 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో పొలానికి సంబంధించినవి 7, గొడవలకు 2, భర్త హరాస్మెంట్కు 2, ప్లాట్ ఇష్యూ, దొంగతనానికి సంబంధించినవి ఒక్కొక్కటి ఉన్నాయి. బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
News November 24, 2025
వన్డేలకు రెడీ అవుతున్న హిట్‌మ్యాన్

ఈ నెల 30 నుంచి సౌతాఫ్రికాతో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం రోహిత్ శర్మ సిద్ధం అవుతున్నారు. గత 5, 6 రోజులుగా అతడు బెంగళూరు ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారు. ఫిట్నెస్ పెంచుకోవడంతో పాటు ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లతో స్పెషల్ సెషన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు తాను జిమ్‌లో గడిపే ఫొటోలను రోహిత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
News November 24, 2025
హేమమాలినితో హగ్స్ కోసం ధర్మేంద్ర ఏం చేశారంటే..?

‘షోలే’ మూవీ షూటింగ్లో<<18374925>>ధర్మేంద్ర<<>> ఓ కొంటె పని చేశారు. హీరోయిన్ హేమమాలినితో హగ్స్ కోసం స్పాట్ బాయ్స్‌కు లంచం ఇచ్చారు. షాట్ మధ్యలో అంతరాయం కలిగించాలని వారికి చెప్పారు. రీటేక్ తీసుకునేలా చేసినందుకు ₹20 చొప్పున ₹2 వేలు స్పాట్ బాయ్స్‌కు ఇచ్చారు. అంటే దాదాపు 100 వరకు రీటేక్స్ తీసుకున్నారు. షోలే 1975లో రిలీజ్ కాగా, వీరిద్దరూ నాటకీయ పరిణామాల మధ్య 1980లో పెళ్లి చేసుకున్నారు.


