News July 8, 2025

GREAT: 67 ప్రాణాలు కాపాడిన కుక్క..!

image

హిమాచల్ ప్రదేశ్‌ వరదల్లో ఓ కుక్క 67 మంది ప్రాణాలను కాపాడింది. గత నెల 30న అర్ధరాత్రి మండి జిల్లా సియాథిలో ఓ కుక్క అరుపులు విని గ్రామస్థుడు నరేంద్ర నిద్ర లేచాడు. ఆ సమయంలో ఇంట్లోని గోడకు పగుళ్లు, నీరు లీక్ కావడం గమనించి గ్రామస్థులందరినీ అప్రమత్తం చేశాడు. వారు వెంటనే గ్రామాన్ని విడిచారు. కాసేపట్లోనే కొండచరియలు విరిగిపడి ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. కుక్క అరుపు వల్ల 20 కుటుంబాలు సురక్షితంగా బయటపడ్డాయి.

Similar News

News July 8, 2025

ఈవోలపై దాడులు చేస్తే ఊరుకోం: మంత్రి సురేఖ

image

TG: భద్రాచలం ఈవో రమాదేవిపై <<16992146>>దాడిని<<>> దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఖండించారు. ఈవోలపై దాడులు చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. దాడి జరిగిన ప్రాంతం ఏపీ పరిధిలోనిది కావడంతో సీఎం చంద్రబాబు కలగజేసుకొని, సమస్యను పరిష్కరించేలా చూడాలని ఆమె కోరారు. తెలంగాణలో ఎండోమెంట్ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని సురేఖ హెచ్చరించారు.

News July 8, 2025

‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ అరెస్ట్

image

‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ షాహిర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి తండ్రి బాబు షాహిర్, నిర్మాత షాన్ ఆంటోనీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే వారు స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ ఆర్థిక మోసం కేసులో వీరిని అరెస్ట్ చేశారు. ఆ మూవీ కోసం తన నుంచి సౌబిన్, ఆంటోనీలు రూ.7 కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టినట్లు ఇన్వెస్టర్ సిరాజ్ వలియతుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 8, 2025

జన సమీకరణకు ప్రయత్నిస్తే కేసులు: ఎస్పీ

image

AP: చిత్తూరు(D) బంగారుపాలెంలో రేపు మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో SP మణికంఠ చందోలు YCP నేతలను హెచ్చరించారు. ‘ఇది రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే. కొందరు జన సమీకరణ చేసి బహిరంగ సభలా మార్చాలని చూస్తున్నారు. ర్యాలీలకు సిద్ధమవుతున్నారు. వారిపై కేసులు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేస్తాం. ఇప్పటివరకు 375 మందికి నోటీసులు జారీ చేశాం’ అని వివరించారు. కాగా జగన్ టూర్‌లో 500 మందికి మాత్రమే అనుమతినిచ్చారు.