News July 26, 2024
GREAT: 20 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడి అమరుడైన డ్రైవర్

తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో స్కూల్ బస్సు డ్రైవర్ 20 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడి తనువు చాలించారు. పిల్లలను ఇంటికి తీసుకెళ్తుండగా అతనికి గుండెపోటు వచ్చింది. నొప్పిని భరిస్తూనే బస్సును రోడ్డు పక్కన ఆపి సీటులో కుప్పకూలారు. ఆ స్కూల్‌లో పనిచేస్తున్న అతని భార్య కూడా అదే బస్సులో ఉన్నారు. డ్రైవర్ సెమలయ్యప్పన్ వీరోచిత చర్యను CM స్టాలిన్ ప్రశంసించారు. అతని కుటుంబానికి ₹5 లక్షల పరిహారం ప్రకటించారు.
Similar News
News November 20, 2025
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్.. ఇవాళే లాస్ట్ డేట్

ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్‌షిప్‌ని అందిస్తోంది. నేటితో దరఖాస్తు గడువు ముగుస్తోంది. పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ప్రస్తుతం CBSE అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవచ్చు. గతేడాది ఎంపికైన విద్యార్థినులూ రెన్యువల్ చేసుకోవచ్చు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. వెబ్‌సైట్ <
News November 20, 2025
ఇస్రోలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<
News November 20, 2025
IIT రామయ్య@100: CM చెప్పినా సీటిచ్చేవారు కాదు!

TG: విద్యారంగంలో చుక్కా రామయ్య ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి. 1925 నవంబర్ 20న జనగామ జిల్లా గూడూరులో జన్మించారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించి, కళాశాల ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశారు. తర్వాత Hydలో IIT కోచింగ్ సెంటర్ స్థాపించారు. CM స్థాయి వ్యక్తులు రిఫర్ చేసినా సీటు ఇచ్చేవారు కాదని స్వయంగా CBN ఒకసారి చెప్పారు. రామయ్య ఉమ్మడి ఏపీలో MLCగానూ సేవలందించారు. ఇవాళ 100వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.


