News February 5, 2025
గ్రేట్.. ఈ డాక్టర్ ఫీజు రూ.10 మాత్రమే

జబ్బుపడి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ ఫీజు రూ.500పైమాటే. కానీ, రూ.10 మాత్రమే ఫీజుగా తీసుకుంటూ పేదలకు వైద్య సేవలందిస్తున్నారు పట్నాకు చెందిన డాక్టర్ ఎజాజ్ అలీ. 40 ఏళ్లుగా రూ.10 తీసుకొని రోగులకు అత్యున్నత చికిత్స అందించేందుకే ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన అందించిన సరసమైన చికిత్స లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేసింది. ఆరోగ్య సంరక్షణలో ఎజాజ్ చేసే నిస్వార్థ సేవను అభినందించాల్సిందే.
Similar News
News November 19, 2025
బాపుఘాట్ సుందరీకరణ.. DECలో ప్రారంభం!

HYD మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సరికొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నది సుందరీకరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్లో పనులు ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
News November 19, 2025
హోటల్ రూమ్‌లకు భలే డిమాండ్

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు భారీగా తరలివస్తుండటంతో పుట్టపర్తిలో లాడ్జిలకు డిమాండ్ పెరిగింది. రూ.5 వేలు పెట్టినా రూములు దొరకడం లేదు. అయితే, ట్రస్ట్ తరఫున 50 వేల మందికి సరిపడేలా వసతి షెడ్లు ఏర్పాటు చేసి, మూడు పూటలా భోజన సౌకర్యం కల్పించారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి నిలయానికి ఉతచి బస్సులు ఏర్పాటు చేశారు. దేవభూమి ఆధ్యాత్మక శోభతో వెలుగొందుతోంది.
News November 19, 2025
నేడు బాపట్ల జిల్లా రైతుల ఖాతాల్లో రూ.107.21కోట్లు జమ!

బాపట్ల జిల్లాలోని సుమారు 1,60,441 రైతుల అకౌంట్లలోకి అన్నదాత సుఖీభవ 2వ విడత రూ.5,000, పీఎం కిసాన్ 21వ విడత రూ.2,000 కలిపి మొత్తంగా రూ.7,000లు బుధవారం జమ కానున్నాయి. ఈ మేరకు జిల్లా ఇన్‌ఛార్జి డీఏవో కె.అన్నపూర్ణమ్మ వివరాలను మంగళవారం వెల్లడించారు. జిల్లాలోని 25 మండలాల్లోని రైతులకు రూ.107.21 కోట్ల లబ్ధి చేకూరనున్నట్లు ఆమె తెలిపారు.


