News November 16, 2024

భారత్ ఘన విజయం.. సిరీస్ మనదే

image

చివరి టీ20లో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 283/1 స్కోర్ చేసింది. తిలక్ వర్మ(120*), శాంసన్(109*) సెంచరీలతో చెలరేగారు. ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 148 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 135 రన్స్ తేడాతో గెలిచింది.

Similar News

News November 10, 2025

బాండా వర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

బాండా వర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీలో 38 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, Asst ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి M.V.SC, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీతో పాటు డాక్యుమెంట్స్‌ను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. టీచింగ్ స్కిల్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://buat.edu.in/

News November 10, 2025

ఈ వారం థియేటర్/OTT అప్డేట్స్

image

* నవంబర్ 14: కాంత(దుల్కర్, భాగ్యశ్రీ, రానా)
* NOV 14: శివ రీరిలీజ్(నాగార్జున, అమల)
* NOV 14: సంతాన ప్రాప్తిరస్తు(విక్రాంత్, చాందిని)
* NOV 14: దే దే ప్యార్ దే 2(అజయ్ దేవగణ్, రకుల్, టబు)
* NOV 13: ఢిల్లీ క్రైమ్-3(నెట్‌ఫ్లిక్స్)
* NOV 14: డ్యూడ్(నెట్‌ఫ్లిక్స్)
* NOV 14: జాలీ ఎల్ఎల్‌బీ(జియో హాట్ స్టార్)

News November 10, 2025

పెరిమెనోపాజ్‌ గురించి తెలుసా?

image

నెలసరి ప్రక్రియలో మార్పులు తలెత్తటం, ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి తగ్గటం మొదలైనప్పటి నుంచీ నెలసరి నిలిచే ముందు దశ ప్రారంభమవుతుంది. దీన్నే పెరిమెనోపాజ్ అంటారు. అంటే మెనోపాజ్‌కు ముందుదశ. ఇది 40ల చివర్లో మొదలవుతుంది. ఈ సమయంలో నెలసరిలో మార్పులు, వేడిఆవిర్లు వస్తుంటాయి. మహిళలు పెరిమెనోపాజ్‌లో రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. సమతుల ఆహారం తీసుకుంటూ ఒత్తిడి లేకుండా ఉండాలి. ఆల్కహాల్, ధూమపానం వంటివి మానేయాలి.