News February 8, 2025

GREAT.. WGL: ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక

image

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీకి చెందిన అల్లూరి రంజిత్ రెడ్డి MBA పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్‌గా పని చేస్తున్నారు. ఆయన జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలో “మా ఇల్లు ఆశ్రమం”లో అనాథగా పెరిగిన విజేతను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక ఎంతో వైభవంగా నిర్వహించారు. వీరికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

Similar News

News December 24, 2025

పరవాడ: ఫోర్జరీ పత్రాలతో భూమిని విక్రయించిన వ్యక్తి అరెస్టు

image

ఫోర్జరీ పత్రాలతో భూమిని విక్రయించిన పరవాడ మండలం తిక్కవానిపాలెం గ్రామానికి చెందిన టి.సత్యనారాయణను అరెస్టు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు మంగళవారం తెలిపారు.అదే మండలం వాడ చీపురుపల్లి పరిధిలో 321 సర్వే నెంబర్లో 6.86 ఎకరాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించాడు. దీనిపై భూమి యజమాని ఎం.సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నిర్ధారణ కావడంతో అరెస్టు చేసామన్నారు.

News December 24, 2025

గాజువాక: వ్యక్తిని రాళ్లతో కొట్టి దారుణ హత్య

image

లంకెలపాలెం వినాయక నగర్ లేఔట్‌లో వ్యక్తి హత్యకు గురయ్యాడు. లంకెలపాలెంకు చెందిన ఈగల వెంకినాయుడును గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

News December 24, 2025

DANGER: HYDలో బయట తిరుగుతున్నారా?

image

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ బుధవారం 237కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT