News February 8, 2025

GREAT.. WGL: ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక

image

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీకి చెందిన అల్లూరి రంజిత్ రెడ్డి MBA పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్‌గా పని చేస్తున్నారు. ఆయన జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలో “మా ఇల్లు ఆశ్రమం”లో అనాథగా పెరిగిన విజేతను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక ఎంతో వైభవంగా నిర్వహించారు. వీరికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

Similar News

News October 15, 2025

ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

మనుబోలు(M) కాగితాలపూరు క్రాస్ రోడ్‌లోని పంజాబీ డాబా పక్కనే ఉన్న పొదలలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. జట్లకొండూరుకు చెందిన కసుమూరు రమేశ్(18) వేప చెట్టుకు ఉరి వేసుకుని ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. SI శివ రాకేశ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరుకు తరలించారు.

News October 15, 2025

HYD: కనీసం శుభ్రతకు నోచుకోని కలాం విగ్రహం

image

21వ శతాబ్దపు మహోన్నత వ్యక్తి, అణుశాస్త్రవేత్త, భారతదేశ 11వ రాష్ట్రపతి భారతరత్న Dr.APJ అబ్దుల్ కలాం జయంతి నేడు. చిన్నచిన్న గల్లి లీడర్లకు సైతం విగ్రహాలు పెట్టి పాలాభిషేకాలు చేసే నాయకులు మహోన్నత వ్యక్తి జయంతిని గుర్తుంచుకోకపోవడం విచారకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనస్థలిపురం రెడ్‌ట్యాంక్ వద్ద ఉన్న అబ్దుల్ కలాం విగ్రహం కనీసం శుభ్రం చేయడానికి కూడా నోచుకోకపోవడం గమనార్హం

News October 15, 2025

HYD: రౌడీషీటర్ నవీన్‌రెడ్డి నగర బహిష్కరణ

image

రాచకొండ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. నల్గొండకు చెందిన రౌడీషీటర్ కొడుదుల నవీన్ రెడ్డిపై రాచకొండ సీపీ సుధీర్ బాబు నగర బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. దాడులు, హత్యాయత్నం, బెదిరింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాడన్న కారణంగా అధికారులు 6 నెలల బహిష్కరణ ప్రతిపాదన తీసుకురాగా సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన ప్రస్తతం అబ్దుల్లాపూర్‌మెట్ పరిధి మన్నెగూడలో ఉంటున్నాడు.