News February 8, 2025

GREAT.. WGL: ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక

image

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన అల్లూరి రంజిత్ రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. జఫర్‌గడ్ మండలంలో వీరు “మా ఇల్లు ఆశ్రమంలో” అనాథగా పెరిగిన విజేతను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. అనంతరం ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Similar News

News February 7, 2025

WGL: ముగిసిన మొదటి విడుత ఇంటర్ ప్రయోగ పరీక్షలు

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడుత ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీధర్ సుమన్ తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రయోగ పరీక్షలు ఐదు రోజులు నిర్వహించారన్నారు. ప్రతి రోజు ఉ.9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు వేళల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

News February 7, 2025

రేపు 11 కేంద్రాల్లో జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్

image

జవహర్ నవోదయ విద్యాలయంలో తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్(JNVST) వరంగల్ జిల్లాలోని 11 సెంటర్లలో శనివారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నవోదయ పరీక్ష నిర్వహిస్తున్న ఈ 11 పాఠశాలలకు జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రేపు సెలవు ప్రకటించారు.

News February 7, 2025

వైభవంగా మహా కుంభాభిషేకం ప్రారంభం

image

కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. వేద పండితులు అచలాపురం రిత్వికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత అరుదైన ఘట్టానికి శ్రీకారం జరిగింది. కుంభాభిషేక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని, ముందుకు సాగే విధంగా కార్యాచరణను అధికారులు రూపొందించారు.

error: Content is protected !!