News February 8, 2025
GREAT.. WGL: ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738975435719_717-normal-WIFI.webp)
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీకి చెందిన అల్లూరి రంజిత్ రెడ్డి MBA పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్‌గా పని చేస్తున్నారు. ఆయన జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలో “మా ఇల్లు ఆశ్రమం”లో అనాథగా పెరిగిన విజేతను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక ఎంతో వైభవంగా నిర్వహించారు. వీరికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
Similar News
News February 8, 2025
NZB: ‘స్థానిక’ ఎన్నికలు.. కాంగ్రెస్, BRS, BJP మంతనాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738991522097_18060220-normal-WIFI.webp)
ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS, BJPకి చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.
News February 8, 2025
సిద్దిపేట: దరఖాస్తుల పేరిట ప్రభుత్వం దగా: హరీశ్ రావు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738995456305_51703636-normal-WIFI.webp)
దరఖాస్తుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ‘X’లో మండిపడ్డారు. ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులకు విలువ లేదా అని ఎద్దేవా చేశారు. ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా ప్రశ్నించారు.14 నెలల కాంగ్రెస్ పాలనలో గందరగోళం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలన్నారు.
News February 8, 2025
1000 వికెట్లు సాధించడమే నా లక్ష్యం: రషీద్ ఖాన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738996625447_1045-normal-WIFI.webp)
టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు(461 మ్యాచుల్లో 633 వికెట్లు) తీసిన అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ 1000 వికెట్ల మార్కును లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘1000 వికెట్లు దక్కించుకోవడమనేది నమ్మశక్యం కాని అద్భుతమైన ఘనత. ఫిట్‌గా ఉండి, ఇప్పుడు ఆడుతున్న స్థాయిలోనే ఆడితే మరో మూడు, నాలుగేళ్లలో కచ్చితంగా తీస్తా. 4అంకెల వికెట్లు అనేది బౌలర్ ఊహకు మాత్రమే సాధ్యం’ అని పేర్కొన్నారు.