News July 14, 2024
భారత్ ఘన విజయం.. 4-1 తేడాతో సిరీస్ కైవసం

జింబాబ్వేతో జరిగిన 5వ T20లో భారత్ 42 రన్స్ తేడాతో విజయం సాధించింది. 168 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ZIMను 18.3 ఓవర్లలో 125 పరుగులకు IND కట్టడి చేసింది. జింబాబ్వేలో డియోన్(34), అక్రమ్(27), తడివానాషే(27) రాణించినా మిగతా ప్లేయర్లు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. భారత బౌలర్లలో ముకేశ్ 4, దూబే 2 వికెట్లు, దేశ్‌పాండే, సుందర్, అభిషేక్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో సిరీస్‌ను IND 4-1 తేడాతో కైవసం చేసుకుంది.
Similar News
News October 15, 2025
ట్యాబ్లెట్లతో మైగ్రేన్‌ను ఆపాలనుకుంటున్నారా?

మైగ్రేన్ సమస్య ఈ మధ్యకాలంలో చాలామందిని వేధిస్తోంది. ఈ తలనొప్పి జీవిత నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో నెలకు మూడు సార్లకంటే ఎక్కువ మైగ్రేన్ ట్యాబ్లెట్స్ వాడొద్దని ప్రముఖ న్యూరో డాక్టర్ సుధీర్ తెలిపారు. ‘తరచుగా వాడితే తలనొప్పి మరింత పెరిగే ప్రమాదం ఉంది. మైగ్రేన్‌ను అదుపులో ఉంచుకునేందుకు వైద్యుడిని సంప్రదించండి. తక్షణ మందులకు బదులు నివారణ చికిత్స గురించి సలహా తీసుకోండి’ అని తెలిపారు.
News October 15, 2025
పాక్-అఫ్గాన్ మధ్య సీజ్ఫైర్.. అడుక్కున్న పాకిస్థాన్!

పాకిస్థాన్-అఫ్గాన్ కాల్పుల విరమణ(సీజ్ఫైర్)కు అంగీకరించాయి. 48 గంటల పాటు ఇది అమల్లో ఉండనుంది. పాక్ ఆర్మీ సీజ్ఫైర్ కోసం అఫ్గానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వాన్ని అడుక్కున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య జరిగిన <<18012870>>ఘర్షణల్లో<<>> పాక్ సైనికులతో పాటు అఫ్గాన్ సోల్జర్స్, TTP ఫైటర్లు, అమాయక ప్రజలు మరణించారు. కాగా ఆపరేషన్ సిందూర్‌తో భారీగా నష్టపోయిన పాక్.. భారత్‌ను సీజ్ఫైర్ కోసం అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
News October 15, 2025
అనంతపురంలో ఏరోస్పేస్&ఆటోమోటివ్: లోకేశ్

AP: అనంతపురంలో రేమండ్ కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఏరోస్పేస్, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల సబ్సిడీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.