News August 5, 2024

GREAT: నిద్రలో నుంచి లేచొచ్చి గోల్డ్ కొట్టింది

image

పారిస్ ఒలింపిక్స్‌లో ఉక్రెయిన్‌ క్రీడాకారిణి యారోస్లావా మహుచిఖ్ మహిళల హై-జంప్‌లో గోల్డ్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే, బరిలోకి దిగేముందు ఆమె బ్యాగ్‌పై నిద్రపోయి కనిపించారు. స్టార్ట్ అయ్యే సమయానికి లేచి అటెంప్ట్ చేసి గోల్డ్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా, రిలాక్స్ అయ్యేందుకు తాను కాసేపు ఇలా నిద్రిస్తుంటానని ఆమె మెడల్ గెలిచాక చెప్పారు.

Similar News

News March 18, 2026

మరో 10 రోజుల్లో సందడే సందడి!

image

క్రికెట్ అభిమానుల నిరీక్షణకు మరో 10 రోజుల్లో తెరపడనుంది. ఈ నెల 28న IPL సీజన్-19 అట్టహాసంగా <<19356627>>ప్రారంభం<<>> కానుంది. 10 జట్లు టైటిల్ వేటలో పోటీ పడనున్నాయి. సమ్మర్‌లో సుమారు 2 నెలల పాటు ఫ్యాన్స్‌కు వినోదం పంచనున్నాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ RCB, SRH తలపడనున్నాయి. మరి మీ ఫేవరెట్ టీమ్ ఏది? టైటిల్ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 18, 2026

ధురంధర్-2: ఇంకా థియేటర్లకు చేరని సెకండాఫ్?

image

భారీ అంచనాల మధ్య రేపు విడుదలవుతున్న ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా షోలపై అనుమానాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించి కేవలం ఫస్టాఫ్ మాత్రమే థియేటర్లకు చేరినట్లు సమాచారం. క్లైమాక్స్, సెకండాఫ్‌లో కొన్ని మార్పులు చేస్తుండటంతో పూర్తి సినిమా అందడంలో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ ద్వారా కంటెంట్ పొందే థియేటర్లు మేనేజ్ చేసినా హార్డ్ డ్రైవ్‌లపై ఆధారపడే సింగిల్ స్క్రీన్లకు కష్టాలు తప్పవు.

News March 18, 2026

పాకిస్థాన్‌కు అఫ్గాన్ క్రికెటర్ బిగ్ వార్నింగ్

image

కాబూల్‌ <<19403539>>ఆస్పత్రి<<>> ఘటనపై అఫ్గాన్ యంగ్ స్పిన్నర్ ఘజన్‌ఫర్ స్పందించారు. ‘దాడిలో గాయపడిన వారి వద్ద చికిత్స చేయించుకోవడానికి డబ్బుల్లేవు. సామాన్య ప్రజలపై దాడి చేయడాన్ని అఫ్గాన్ సహించదు. ప్రతిఒక్కరికీ AFG చరిత్ర తెలుసు. అది రిపీటైతే PAKకు మంచిది కాదు’ అని వార్నింగ్ ఇచ్చారు. తమకు భారత్ మిత్ర దేశమని, దాడుల గురించి చర్చించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇక ప్రపంచ దేశాలు AFGకు మద్దతుగా నిలవాలని ఘజన్‌ఫర్ కోరారు.