News October 22, 2024

GREAT: వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు కామారెడ్డి బిడ్డ

image

కామారెడ్డి జిల్లా పిట్లం మండలకేంద్రానికి చెందిన తక్కడ్‌పల్లి ప్రతిభ వరల్డ్ ఛాంపియన్ షిప్ చెస్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ నెల 23 నుంచి 28 వరకు ఆర్మేనియా దేశం, ఏరేవాన్‌లో జరగనున్న 6వ ప్రపంచ స్థాయి చేస్ బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి. కామారెడ్డి జిల్లా నుంచి ప్రపంచ స్థాయి క్రీడల్లో పాల్గొనడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

☛ ALL THE BEST PRATIBA

Similar News

News January 3, 2025

NZB: పాముతో చెలగాటం ఆడుతున్న బాలురులు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొందరు చిన్న పిల్లలు పాములతో ప్రమాదకరంగా విన్యాసాలు చేశారు. ఈ ఘటన గురువారం నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయం ముఖ ద్వారం వద్ద చోటుచేసుకుంది. పీల స్కూల్ సమీపంలో పామును పట్టుకొని కొందరు పిల్లలు ఆటలాడుతూ తిరిగారు. కొంచెమైనా భయం లేకుండా పాముతో చెలగాటం ఆడుతూ సెల్ఫీలు దిగారు. పిల్లలపై స్థానిక వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు.

News January 3, 2025

NZB: ఉమ్మడి జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి దీంతో చలి పంజాబీ విసురుతుంది. ఉదయం మంచు ఉగ్రరూపం ప్రదర్శిస్తుంటే రాత్రి చలి తాకిడి ఎక్కువవుతుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు డోంగ్లి 10.2, గాంధారి 11.2, జుక్కల్ 11.5, సర్వాపూర్ 12.7, మేనూర్ 12.9 కాగా నిజామాబాద్ జిల్లాలో మెండోరా 12.5, తుంపల్లి 13.1 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News January 2, 2025

మాచారెడ్డి: రెసిడెన్షియల్ కోసం ఫేక్ ఆధార్..

image

రెసిడెన్షియల్ కోసం మీసేవ నిర్వాహకుడు డూప్లికేట్ ఆధార్ క్రియేట్ చేసిన ఘటన మాచారెడ్డి మండలం ఘన్పూర్‌లో జరిగింది. పోలీసుల వివరాలిలా.. గ్రామానికి చెందిన ముహమ్మద్ షరీఫ్ ఫిలిప్పీన్ దేశానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోసం మీసేవ నిర్వాహకుడి సాయంతో డూప్లికేట్ ఆధార్ తయారు చేశారు. భార్యాభర్తల ఆధార్ నంబర్ సేమ్ ఉండడంతో RI రమేశ్ PSలో ఫిర్యాదు చేశారు.