News August 10, 2024

HYDలో రూ.3350 కోట్లతో గ్రీన్ డేటా సెంటర్

image

HYDలో ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆరుమ్ ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ ప్రకటించింది. US కాలిఫోర్నియాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అనంతరం సంస్థ ఈ మేరకు ప్రకటన చేసింది. రూ.3357 కోట్లతో ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య డిజిటల్ సేవల అంతరాన్ని తగ్గించేందుకు తమ పెట్టుబడి ఉపయోగపడుతుందని సంస్థ అభిప్రాయపడింది.

Similar News

News March 16, 2026

ఆస్కార్ అవార్డులు అందేదెవరికో!

image

మరికాసేపట్లో 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. సిన్నర్స్ మూవీ 16 నామినేషన్లతో టాప్‌లో ఉంది. లియోనార్డో డికాప్రియో నటించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్-13, సెంటిమెంటల్ వాల్యూ-9, ఫ్రాంకెన్‌స్టైన్-9, హామ్నెట్-8, ఎఫ్1-4 నామినేషన్లు సాధించాయి. తె.4.30 నుంచి హాట్‌స్టార్ OTTలో, స్టార్ మూవీస్ ఛానల్‌లో LIVE చూడొచ్చు.

News March 16, 2026

యానాం: ఉండేది ఏపీలో.. కానీ!

image

పుదుచ్చేరి(UT) అసెంబ్లీ <<19389988>>ఎన్నికలకు షెడ్యూల్<<>> వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా APలోని కాకినాడ దగ్గరున్న యానాం సీటుకూ ఎలక్షన్ జరగనుంది. ఇది భౌతికంగా APలో ఉన్నా పుదుచ్చేరి పాలనా పరిధిలో ఉండటమే ఇందుకు కారణం. 1954 వరకు ఫ్రెంచ్ పాలనలో యానాం ఉండింది. కానీ 1963లో అప్పటి ఒప్పందాల మేరకు UTగా పాండిచ్చేరి, కారైకల్, మాహేలతోపాటు విలీనమైంది. యానాం-పుదుచ్చేరి మధ్య సుమారు 780km దూరం ఉండటం గమనార్హం.

News March 16, 2026

మార్చి 16: చరిత్రలో ఈరోజు

image

*1764: తెలుగు భాష తొలి నిఘంటు కర్త మామిడి వెంకటార్యులు జననం
*1901: ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు జననం
*1917 ఆంధ్రప్రదేశ్ మెుదటి లోకాయుక్త ఆవుల సాంబశివరావు జననం
*1963: భారత దేశ రెండో ప్రధాన న్యాయమూర్తి ఎం.పతంజలి శాస్త్రి మరణం
*జాతీయ టీకా దినోత్సవం