News July 7, 2024

పసిడి పరుగులు.. ఇన్వెస్టర్లకు లాభాలు

image

బంగారంపై పెట్టుబడితో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండుతోంది. జనవరి-జూన్‌లో నిఫ్టీ 11% లాభపడితే.. పసిడి 14% ఆదాయాన్ని అందించింది. పెద్ద దేశాలు బ్యాంకుల నుంచి గోల్డ్‌ను కొనుగోలు చేస్తుండటం, అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడిని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.74వేలు ఉండగా, త్వరలోనే రూ.78వేలకు చేరే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

Similar News

News November 9, 2025

ఎవరిది అగ్రికల్చరో.. ఎవరిది డ్రగ్స్ కల్చరో చూడండి: రేవంత్

image

TG: BRS పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని CM రేవంత్ మండిపడ్డారు. ‘ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఎవరో పెద్దోళ్లు తీసుకుంటారనుకునేది. ఇప్పుడు గల్లీగల్లీకి విస్తరించారు. అందుకే ఎవరిది అగ్రికల్చరో.. ఎవరిది డ్రగ్స్ కల్చరో, ఎవరిది పబ్ కల్చరో.. ఎవరిది సామాన్యులతో కలిసిపోయే కల్చరో చూడండి. సినీ కార్మికులతో ఎవరు మాట్లాడుతున్నారో.. సినీ తారలతో ఫామ్‌హౌస్‌లో ఎవరు ఉంటున్నారో గుర్తు చేసుకోవాలి’ అని కోరారు.

News November 9, 2025

రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీకి షాకింగ్ కలెక్షన్లు

image

రష్మిక లీడ్ రోల్‌లో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు ఆశించినస్థాయిలో రావట్లేదు. తొలి రోజు తెలుగు, హిందీలో ₹1.30 కోట్లు, రెండో రోజు ₹2.50 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చినట్లు Sacnilk వెల్లడించింది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు పెరగొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బుక్ మై షోలో D1 34K టికెట్లు అమ్ముడవగా, D2 68Kకు పెరిగినట్లు గీతా ఆర్ట్స్ పేర్కొంది.

News November 9, 2025

5 రాష్ట్రాల్లో రూ.95 కోట్ల స్కామ్స్.. 81 మంది అరెస్ట్

image

TG: సైబర్ నేరగాళ్లపై రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం మోపుతోంది. AP, TN, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఆపరేషన్ చేపట్టి 81 మంది నిందితులను అరెస్ట్ చేసింది. వీరిపై 754 కేసులున్నాయని, రూ.95 కోట్ల విలువైన మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 84 ఫోన్లు, 101 సిమ్‌లు, 89 బ్యాంక్ పాస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుల ఖాతాల్లోని రూ.కోట్ల నగదును ఫ్రీజ్ చేశామన్నారు.