News June 17, 2024
గూడూరు-రేణిగుంట మూడో లైన్‌కు గ్రీన్‌సిగ్నల్
AP: గూడూరు-రేణిగుంట మధ్య 3వ రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఈ లైన్ నిర్మించనుంది. ఈ 2 స్టేషన్ల మధ్య 83.17KM దూరానికి రూ.884 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. 2 రైల్వే వంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మించాల్సి ఉండగా.. ఈ ప్రాజెక్టు కోసం 36.58 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటికే విజయవాడ-గూడూరు మధ్య 3వ లైన్ పూర్తికావొస్తోంది.
Similar News
News January 17, 2025
ఇది మా కుటుంబానికి కఠినమైన రోజు: కరీనా
సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి ఘటనపై సతీమణి, హీరోయిన్ కరీనా కపూర్ స్పందించారు. ఇది తమ కుటుంబానికి చాలా కఠినమైన రోజు అని ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్టు చేశారు. ‘అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు. మీడియా ప్రతినిధులు ఊహాజనిత కథనాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా’ అని రాసుకొచ్చారు.
News January 17, 2025
ట్రూత్ ఈజ్ ది ఓన్లీ ఫార్ములా: KTR
TG: ఈడీ విచారణ అనంతరం ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈడీ ఆఫీస్ ముందు మీడియాతో మాట్లాడిన ఫొటోలను షేర్ చేసిన ఆయన ‘ట్రూత్ ఈజ్ ది ఓన్లీ ఫార్ములా’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంలోనే కేటీఆర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.
News January 16, 2025
Q3లో రిలయన్స్, జియో ఆదాయాలు ఇలా..
2024-25 Q3లో 7 శాతం వృద్ధితో రూ.18,540 కోట్ల నికర ఆదాయం వచ్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ.2.43 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. ఇక డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి జియో ఆదాయం రూ.6,681 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. 2023 డిసెంబర్ నాటికి రూ.5,447 కోట్లు ఉండగా ఈసారి 26 శాతం పెరిగినట్లు వెల్లడించింది.