News March 29, 2024
తనఖా భూముల పాస్బుక్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్

TG: తనఖా భూముల పాస్‌బుక్‌లను రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సబ్ రిజిస్ట్రార్లకు ప్రత్యేక అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి కారణంగా తనఖా పాస్బుక్ల రిలీజ్ ప్రక్రియ కొన్నేళ్లుగా నిలిచిపోయింది. దీంతో అప్పులు చెల్లించినా రైతులకు పాస్‌బుక్‌లు అందలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రైతులకు ఉపశమనం కలగనుంది.
Similar News
News October 31, 2025
ఆలయాల్లో ధ్వజస్తంభం ఎందుకు?

ధ్వజం అంటే పతాకం. ధ్వజస్తంభం ఉత్సవానికి సంకేతం. హైందవ సంస్కృతిలో దీని చుట్టూ ప్రదక్షిణ చేశాకే దైవదర్శనం చేసుకోవాలని చెబుతుంటారు. ఆలయోత్సవాలు మొదలయ్యేటప్పుడు ఈ స్తంభంపై జయపతాకాన్ని ఎగురవేస్తారు. ధ్వజస్తంభం లేని ఆలయాలకు స్వాములు దేవాలయ గుర్తింపు ఇవ్వరనే నమ్మకం ఉంది. దీనిని ఆలయ హృదయంగా భావిస్తారు. ఇది భక్తులకు శక్తిని, శుభాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. అందుకే ప్రతి ఆలయంలో దీన్ని ప్రతిష్ఠిస్తారు.
News October 31, 2025
ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: CM

AP: ఇకపై ప్రతి నెలా, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను CM CBN ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షించిన ఆయన, ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలన్నారు. NOVలో జరిగే CII సదస్సులోగా పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు CMకు తెలిపారు.
News October 31, 2025
ఆవు నెయ్యి అభిషేకంతో ఐశ్వర్య ప్రాప్తి

శివుడికి అభిషేకాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ పవిత్ర కార్తీక మాసంలో ఆయనకు చాలామంది అభిషేకాలు చేస్తుంటారు. అలా చేసినవారిపై ఆయన అనుగ్రహం కూడా ఉంటుందని నమ్ముతారు. అయితే.. ఆవు నెయ్యితో శివ లింగాన్ని అభిషేకించడం వల్ల ఈశ్వరుడు ఐశ్వర్య ప్రాప్తిని ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు. శ్రేయస్సుకు, పవిత్రతకు చిహ్నంగా భావించే ఈ అభిషేకం ద్వారా అదృష్టం, సంపద కలిసివస్తాయని, ధనలక్ష్మి స్థిరంగా ఉంటుందని నమ్మకం.


