News January 25, 2025
Greenery: కేరాఫ్ అనంతగిరి

గ్రీనరీకి కేరాఫ్ మన అనంతగిరి హిల్స్. హైదరాబాద్ వాసులు వీకెండ్లో ఇక్కడికి వచ్చి రీలాక్స్ అవుతుంటారు. మూసీ పుట్టింది కూడా ఇక్కడే కావడం విశేషం. దీనికితోడు అనంత పద్మానాభ స్వామి టెంపుల్, కోట్పల్లి ప్రాజెక్ట్, పరిగి విండ్ మిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ట్రెక్కింగ్ చేసే వారికి అనంతగిరి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మరి మన జిల్లాలో ఇంకేమైనా వింతలు, విశేషాలు, ఫేమస్ ప్లేస్లు ఉంటే కామెంట్ చేయండి.
Similar News
News December 27, 2025
గంజాయి అక్రమ రవాణాపై KNR సీపీ స్పెషల్ ఫోకస్

కరీంనగర్ కమిషనరేట్లో 2025 సంవత్సరంలో నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తూ 6 కేసుల్లో 25 మంది నిందితులు పట్టుబడ్డారు. వీరి నుంచి 29.042kg గంజాయి, రూ.6,44,150, ఆరు మోటార్ సైకిల్స్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులు 9 నమోదు కాగా 12 మంది అరెస్టయ్యారు. రూ.5,81,280 విలువైన 334 క్వింటాళ్ల బియ్యంతో పాటు 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
News December 27, 2025
‘విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంచేదే NSS’

విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో జాతీయ సేవా పథకం(NSS) కీలకమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. భూంపల్లి హైస్కూల్లో దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న NSS శిబిరాన్ని ఆయన సందర్శించారు. గ్రామంలో ప్లాస్టిక్ నిర్మూలన, వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులు కల్పిస్తున్న అవగాహనను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
News December 27, 2025
నెల్లూరులో ఫేక్ ITCలతో రూ. 43 కోట్ల టోకరా !

నెల్లూరులో పెద్ద పెద్ద కంపెనీలు పన్నుల ఎగవేతకు కొత్త పంథాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ జేసీ కిరణకుమార్ Way2Newsతో మాట్లాడుతూ.. నెల్లూరు డివిజన్ పరిధిలో రూ. 43 కోట్ల మేరా ఫేక్ ITC లను తీసుకున్నారని తెలిపారు. 8 సంస్థలపై కేసులు నమోదు చేశామని, ఇందులో ఐదుగురిపై కేసులు నమోదు చేయగా.. ముగ్గురు 10% డిమాండ్ కట్టి అప్పీల్ కి వెళ్లారని వివరించారు.


