News April 8, 2024

రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం ఉగాది శుభాకాంక్షలు

image

TG: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అంకితభావం, సేవతో మెరుగైన భవిష్యత్తుకు కట్టుబడి ఉందామని గవర్నర్ పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో ప్రజలకు శుభం కలగాలని రేవంత్ ఆకాంక్షించారు. సమృద్ధిగా వానలు కురిసి, రైతులు ఆనందంగా ఉండాలన్నారు.

Similar News

News April 8, 2026

సమ్మర్‌లో ఎలాంటి దుస్తులు వేసుకోవాలంటే..

image

వేసవిలో వేసుకునే దుస్తులు, కలర్స్ విషయంలో శ్రద్ధ వహించాలి. తేలికైన కాటన్, లినెన్, ఖాదీ, రేయాన్ డ్రెస్సులే ధరించాలి. రంగుల విషయానికొస్తే తెలుపు, లేత నీలం, గులాబీ, పసుపు వంటివి ఎంచుకోవాలి. బ్లాక్ కలర్ అస్సలు వేసుకోవద్దు. ఇది చర్మం మంటపుట్టేలా చేస్తుంది. స్కిన్ టైట్ జీన్స్, షర్ట్స్ అవైడ్ చేయాలి. ఇక ఎండలో వెళ్లేటప్పుడు హాఫ్ హ్యాండ్ షర్ట్స్ కాకుండా చేతులను పూర్తిగా కప్పి ఉంచే చొక్కా ధరించాలి.

News April 8, 2026

హార్ముజ్‌ తీర్మానంపై రష్యా, చైనా వీటో!

image

హార్ముజ్ జలసంధిని రీఓపెన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్న UNSC తీర్మానాన్ని వీటో ప్రయోగించి రష్యా, చైనా రిజెక్ట్ చేశాయి. బహ్రెయిన్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి US సహా 11 దేశాలు మద్దతు తెలిపాయి. UNSCలో చైనా, రష్యా, US, UK, ఫ్రాన్స్‌కు ఈ వీటో అధికారం ఉంటుంది. వీటిలో ఏ ఒక్క దేశం వీటో అధికారాన్ని ఉపయోగించినా తీర్మానం వీగిపోతుంది. ఇరాన్‌కు మద్దతుగా ఆ ఇరు దేశాలు తీర్మానం రిజెక్ట్ చేయడం చర్చనీయాంశమైంది.

News April 7, 2026

వెలిగొండ నిర్వాసితులకు మంత్రి శుభవార్త

image

AP: వెలిగొండ నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.900CRను ఏప్రిల్ నుంచి జూన్ వరకు విడతల వారీగా చెల్లిస్తామని మంత్రి నిమ్మల వెల్లడించారు. ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జూన్ నాటికి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. CM CBN 10 రోజులకు ఒకసారి ప్రాజెక్టు గురించి అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికి 70% హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తయినట్లు తెలిపారు.